China Moon Mission: చంద్రుడి మట్టితో ఇటుకలు, భారీ నిర్మాణాలు… అమెరికా షాక్ అయ్యేలా చైనా మూన్ మిషన్!!
భూమికి వెలువల లభించే మినరల్స్, ఇతర సహజ వనరులను తాము ముందుగా వాడుకోవాలన్న ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలన్నీ స్పేస్‌లోనే జరుగే పరిస్థితులు కనిపిస్తుండటంతో స్పేస్ పవర్‌గా అవతరించేందుకు చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
భూమి, ఆకాశం ఎక్కడైనా ఆధిపత్యం తనదే కావాలి. అమెరికా (Americka), రష్యాను (Russia) వెనక్కి నెట్టి వరల్డ్ సూపర్ పవర్‌గా ఎప్పటికీ నిలిచిపోవాలి. ఇదే చైనా (China) మాస్టర్ ప్లాన్. అమెరికా, రష్యా సహా మిగతా దేశాల కంటే ఎంతో అడ్వాన్స్‌గా ఆలోచించే కమ్యూనిస్ట్ (Communist) కంట్రీ ఖగోళంలో ఆధిపత్యం కోసం భారీ ప్రణాళికనే సిద్ధం చేసుకుంది. ఇప్పటికీ కొన్ని దేశాలు చంద్రుడిపై (Moon) అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. చైనా మాత్రం అక్కడి మట్టితో ఇటుకలు తయారు చేసి భారీ నిర్మాణాలు చేపట్టే ప్రణాళికతో వ్యూహాలు రచిస్తోంది. తనకంటూ ప్రత్యేకంగా స్పేస్ సెంటర్‌ను (Space Centre) నిర్మించుకున్న చైనా చంద్రుడిపై పట్టుకోసం లూనార్ బేస్ (Lunar Base) దిశగా అడుగులు వేస్తోంది. రానున్న ఐదేళ్లలో చంద్రుడిపై ఉన్న సాయిల్‌ను (Soil) ఉపయోగించి లూనార్ బేస్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం పెద్ద కసరత్తే చేస్తోంది.
చేంజ్… చైనా మూన్ మిషన్
చైనీయులు చంద్రుడిని దేవతగా చూస్తారు. అందుకే మూన్ మిషన్‌కు (Moon Mission) కూడా చైనా ఛాంగే (Chang’e) అనే దేవత పేరు పెట్టింది. చంద్రుడిపై ఆధిపత్యం చలాయించేందుకు డ్రాగన్ (Dragon) కంట్రీ 2007 నుంచి నాలుగు దశల్లో ప్రణాళికను అమలు చేస్తోంది. రానున్న ఐదేళ్లలో అంటే 2028 నాటికి చంద్రుడిపై ఉన్న మట్టితో ఇటుకలను తయారు చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. వాటితో చంద్రుడిపైనే నిర్మాణాలు చేయడం కూడా చైనా ప్రణాళికలో ఓ భాగం. చంద్రుడిపై మొత్తం లూనార్ బేస్‌ని అక్కడ లభించే సహజ వనరులతోనే నిర్మించే ఆలోచనలో ఉంది చైనా.
వుహాన్‌లో కీలక సమావేశం
ప్రపంచానికి కరోనా (Corona) వైరస్‌ను అంటించడానికి కారణమైన చైనాలోని వుహాన్ (Wuhan) నగరమే ఆ దేశ లూనార్ మిషన్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, స్పేస్ కాంట్రాక్టర్లు ఇటీవలే వుహాన్ నగరంలో సమావేశమై లూనార్ మిషన్‌పై చర్చించారు.
చైనాకు ఎందుకింత ఆరాటం ?
భూమికి వెలుపల ఉన్న సహజ వనరులను ముందుగా తామే హస్తగతం చేసుకోవాలని అమెరికా, చైనా, రష్యా వంటి దే్శాలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయతే ఆ రేస్‌లో చైనా ముందు ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఖగోళంలో ఈ దిశగా అన్వేషణలు కూడా చేస్తున్నాయి. భూమికి వెలువల లభించే మినరల్స్, ఇతర సహజ వనరులను తాము ముందుగా వాడుకోవాలన్న ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలన్నీ స్పేస్‌లోనే జరుగే పరిస్థితులు కనిపిస్తుండటంతో స్పేస్ పవర్‌గా అవతరించేందుకు చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చంద్రుడిపై నిర్మించబోయే లూనార్ బేస్‌కు న్యూక్లియర్ ఎనర్జీని కూడా జోడించే ఆలోచనలో ఉంది చైనా. ఇదే జరిగితే స్పేస్ వార్‌లో చైనా పచేయి సాధించినట్టే.