Cocopeat: రైతుకు సాయం చేసే సరికొత్త వ్యవసాయం..!

వ్యవసాయం అంటే.. రైతు ప్రపంచానికి చేసే సాయం అని అర్థం. మనం ఎంత సంపాదించినా అది కేవలం పొట్ట కూటికోసమే అన్న విషయం తెలుసుకోవాలి. అలా పుట్టెడు మెతుకులు నోట్లోకి వెళ్లాలంటే దాని వెనుక కర్షకుని కష్టం చాలా ఉంటుంది. నేటి సమాజంలో రైతుల కష్టానికి కన్నీళ్లు తప్ప మరేమీ మిగలడం లేదు. అందుకే రైతులకు ఊతం ఇచ్చేందుకు సరికొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2023 | 02:02 PMLast Updated on: Mar 05, 2023 | 2:02 PM

Cocopeat Forming Veg At Home

అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది రోజురోజుకూ సరికొత్త మార్గం ఎంచుకుంటోంది. దీని ప్రభావం అన్ని రంగాల మీద పడినట్లే వ్యవసాయ రంగం మీద కూడా పడింది. పైగా అనాది నుంచి మనది వ్యవసాయ సమాజమాయే. రైతే రాజు అనేలా ఒక్కప్పటి పరిస్థితులు కాస్త నిరుపేదలంటే రైతులే అనేలా కాలం మార్పు చెందింది. అంతేకాకుండా పంట పండించాలంటే కనీసం అర ఎకరా అయినా ఉండాలి. భూమికి తగ్గ సాగు చేయాలి అని పరంపర ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక అలాంటప్పుడు చిన్న సన్నకారు రైతులు పెట్టుబడి పెట్టినప్పటికీ అది ఆశించినంత ఫలితం రాలేదంటే అంతే సంగతి. కానీ ఇక్కడ కేవలం 500నుంచి వెయ్యి గజాల్లో దాదాపు 3000కు పైగా మొక్కలను పండించవచ్చు. ఇలా చేసినప్పుడు నష‌్టపోకుండా వ్యవసాయం ఎలా చేయాలి అనే మెళుకువలను మనకు అందిస్తుంది ఒక సంస్థ. దీనిపేరు మెడవ్ బ్రీత్ ఆఫ్ క్వాలిటీ. ఇది కోయంబత్తూర్ లో ఉంది.

ప్రస్తుతం వ్యవసాయం రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల్లో ఇది కూడా ప్రదానమైనదని చెప్పాలి. వీరి అంకురం అద్భుతం అని చెప్పాలి. కొబ్బరి పీచుతో, కుళ్లిన వ్యర్థాలతో మట్టిని తయారుచేసి మేలిమిరకం ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. దీనివల్ల సాధారణంగా చేసే సాగుకంటే నీటి ఖర్చు చాలా తక్కువ అని చెప్పాలి. కేవలం 25శాతం నీటితోనే మనకు ఉన్న తక్కువ స్థలంలో దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం ఒపెన్ టాప్ గ్రో బ్యాగ్స్, లే ఫ్లాట్ గ్రో బ్యాగ్స్, గ్రో క్యూబ్స్, బల్క్ బ్లాక్స్ లో కోకోపీట్ వేసి కు‌ళ్లిన వ్యర్ధాలను కలిపి అవసరం అయిన పంట విత్తనాలను వేయాలి. మంచి క్వాలిటీతో కూడిన పంట చేతికి వస్తుంది.

agriculture

agriculture

మనకు ఇంట్లో పెరడుందనుకోండి దీని పని చాలా సులభం అవుతుంది. మనకు నిత్యం కావల్సిన కూరగాయలను ఇంట్లోనే రసాయనాలు లేకుండా పండించవచ్చు. లేదా వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కమర్షియల్ కోసం అయితే కనీసం 500 నుంచి వెయ్యి గజాల స్థలం ఉండాలి. బయటిగాలి అందులోకి రాకుండా ఒక షెడ్డును నిర్మించుకోవాలి. ఈ నిర్మాణంలో పాలియోస్, కూలింగ్ ప్యాడ్, ఫ్యాన్స్ ను ఉపయోగిస్తారు. నేలపై పెద్ద ట్యాంకర్ను ఏర్పాటుచేసి ఆ ట్యాంక్ పై ప్లాస్టిక్ పైపులతో స్టాండ్ లాగా అమర్చుతారు. ఇందులో నీరు ప్లో అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ ఎలాంటి మట్టిని ఉపయోగించరు. కేవలం నీటి ట్యాంకర్లో సాగుకు సంబంధించిన మందులను కలుపుతారు. వీటికి క్లే బాల్స్ సహాయంతో విత్తనాలను ఏర్పటు చేస్తారు. తద్వారా స్టాండ్స్ లాగా అమర్చిన తొట్టెలో నీరు సరఫరా అయి మొక్కకు కావల్సిన పోషణ అందుతుంది. మార్కెట్లో దొరికే కంటే కూడా మంచి మేలిమిజాతి కూరగాయలను పండించవచ్చు. ఇక ఇంటి విషయానికొస్తే బాల్కనీల్లో, ఇంటి ముందు వరాండాల్లో చిన్న పాటి ఆకుకూరలను పెంచుకోవచ్చు. దీనికి హైడ్రోపోనిక్ సిస్టం ద్వారా పాలియోస్ కూలింగ్ ప్యాడ్స్ ని ఏర్పాటు చేస్తారు. మెక్కలకు చల్లదనం కోసం ఫ్యాన్లను అమర్చుకోవాలి. దీంతో ఆకుకూరలను ఇంట్లోనే పండించుకోవచ్చు.

 

 

 

 

T.V.SRIKAR