Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. పంచమి తీర్థానికి భారీగా తరలివస్తున్న భక్తులు
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ అనేది ప్రతి రోజు కూడా రద్దీగానే ఉంటుంది. తిరుమల లో రద్దీ లేని రోజు అంటూ ఉండదు.. ఒక్క కరోనా సమయంలో తప్ప ఎప్పుడూ కూడా తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్న ఉంటుంది. మారి కార్తిక మాసం సమయంలో అయితే.. తిరుమలలో ఇసుక పోస్తే రాలనంత జనం వస్తారు.
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ అనేది ప్రతి రోజు కూడా రద్దీగానే ఉంటుంది. తిరుమల లో రద్దీ లేని రోజు అంటూ ఉండదు.. ఒక్క కరోనా సమయంలో తప్ప ఎప్పుడూ కూడా తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్న ఉంటుంది. మారి కార్తిక మాసం సమయంలో అయితే.. తిరుమలలో ఇసుక పోస్తే రాలనంత జనం వస్తారు. ఇప్పుడేందుకు అంటునారా మరి ఇది కార్తీక మాసం మే కధా..
ఇది కూడా చదవండి : BRS party : బీఆర్ఎస్ కి గుర్తుల భయం.. ఏయే నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ అంటే..!
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తీక మాసం సందర్భంగా కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. భక్తుల రాకతో 26 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా నిన్న స్వామివారిని 71,123 మంది భక్తులు దర్శించుకోగా స్వామి వారికి 26,689 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ.3.84 కోట్లు వచ్చిందని వివరించారు టీటీడీ బోర్టు.
పంచమి తీర్థానికి.. టీటీడీ పటిష్ట ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 18న నిర్వహించనున్నారు. పంచమి తీర్థానికి టీటీడీ అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వాహన సేవలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పంచమి తీర్థానికి వచ్చే భక్తులందరికీ అల్పాహారం, తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. పంచమి తీర్థానికి తమిళనాడు తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి లక్షల సంఖ్య లో తరలి వచ్చే భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వివరించారు.