Cooking Robot: రోబోలందు వంట చేసే రోబోలు వేరయా.. ఏఐతో ఈ ప్రయోగం సాధ్యమైందయా..

సాధారణంగా ఎక్కువ శాతం మంది వండేందుకంటే కూడా వండింది తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వండే విధానంలో వచ్చిన మార్పులు, ఎలా చేయాలో తెలియకపోవడం, చేతులు కాలడం, రుచి సరిగా రాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా చాల సమస్యల కారణంగా ఒక్కోసారి ఇతరులపై ఆధారపడుతూ ఉంటాం. మనకు ఎవరూ చేసి ఇచ్చే వారు లేకుంటే బయట హోటల్స్ కి వెళ్లి ఇష్టమైన, రుచికరమైన ఫుడ్ తింటాం. ఇప్పుడున్న ఆన్ లైన్ యుగంలో అయితే జొమాటో, స్విగ్గి, జెప్టో, ఉబర్ ఈట్స్ ఇలా రకరకాల యాప్స్ ల సహాయంతో ఆర్డర్ చేసుకుంటున్నాం. ఈ సేవలను అందించే కంపెనీ ప్రతినిధులు ఇంటికి తెచ్చి ఇస్తే వాటి ప్యాకింగ్ ఓపెన్ చేసుకొని తినేలా ప్రపంచం మారిపోయింది. ఇలాంటి ప్రపంచంలో రోజుకో వింత పుంతలు తొక్కుతుంది. అలా కొత్తగా ఉదయించిన పరికరమే వండే రోబోలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2023 | 06:44 PMLast Updated on: May 25, 2023 | 6:44 PM

Cooking Robot Innogrtaiong By Ai

ఇప్పటి వరకూ కారు నడిపే రోబోలు, రెస్టారెంట్లో సర్వ్ చేసే వాటిని, ఇల్లు అలికే పరికరాలను చూసి ఉంటాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చప్పుడు చేస్తే తిరిగే ఫ్యాన్లు, కదలికలను బట్టి వెలుగుతూ ఆరిపోయే లైట్లు, వాయిస్ ఆధారంగా మన ఫోన్ ఆపరేటింగ్ చేసే వాటిని చూసి ఉంటాం. అదే చిన్న పిల్లలైతే మనిషి ఆకారంలో బుడి బుడి అడుగులు వేసుకుంటూ మ్యూజిక్ ప్లే చేస్తూ.. రంగు రంగుల లైట్లతో కనిపించే ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ను చూసి ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా తయారైంది ఈ కుకింగ్ రోబోట్. దీని సహాయంతో మంచి రుచికరమైన వంటకాలు వండేయచ్చు. ఇది ప్రయోగం ద్వారా కూడా నిరూపితం అయ్యింది. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం.

అచ్చం అమ్మ చేతి వంట..
తాజాగా షెనాజ్ అనే నటి ఈ పరికరం ద్వారా తనకు ఇష్టమైన పెస్టో పనీర్ చేసి పెట్టింది. అది కూడా నిమిషాల వ్యవధిలో. రోబో వండిన డిష్ రుచి చూసిన షెహనాజ్ దీనిపై స్పందించారు. “రానున్న రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే కుకింగ్ రోబోలు మన ఇంట్లోకి రానున్నాయి. ఇక పై వంట చేసే వారికి పని ఉండకపోవచ్చు. ఈ రోబో చేసిన వంటకం అమ్మ చేతి వంటకంటే కమ్మగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు”. నిజానికి దీనిని కనుగొన్నది గుజూ అనే బెంగళూరు వ్యక్తి. ఇతని తన తల్లి వండే ఆహారం వేరెవరూ చేయలేక పోయారట. సిటీ మొత్తం వెతికినా అతనికి ఆ ఫుడ్ లభించలేదట. అందుకే ఈ పరికరాన్ని కనుగొన్నట్లు చెప్పాడు. ఇలా చేసిన ప్రయోగాన్ని క్రమక్రమంగా వివిధ వంటకాలు వండేలా రూపొందించామని పేర్కొన్నారు.

రోబో పనితీరు ఇలా..
ఈ ఎలక్ట్రానిక్ రోబోలో వంట వండేందుకు కావల్సిన పదార్థాలను లోపల ఉంచేందుకోసం ఒక స్లాటెడ్ ఫ్రేంను అందించారు. ఈ ఫ్రేం లో మనం వండేందుకు అవసరమైన ముడిపదార్థాలను అందులో ఉంచాలి. ఆతరువాత ఇండక్షన్ స్టౌ మోడల్లో ఒక ప్లేట్ ఉంటుంది. దానిపై వంట వండేందుకు అవసరమైన పాత్రను అమర్చిలి. ఆ పాత్రలోపల కలిపేందుకు ఒక గెరిటె లాంటి ఐరన్ స్టిక్ ఉంటుంది. వండే వంట విధానాన్ని ఏఐ సహాయంతో ప్రోగ్రామింగ్ చేసి ఉంటారు. దీనిని బట్టి అది కావల్సిన పదార్థాలను తగినంత పరిమాణంలో తీసుకుంటుంది. అడుగు అంటకుండా ఉండేందుకు దానంతట అదే కలుపుకుంటూ రుచికరమైన ఫుడ్ ను అందిస్తుంది. దీని ప్రాసెస్ మొత్తం గమనించేందుకు, తెలుసుకునేందుకు రోబో బాడీ బయట ఒక స్క్రీన్ ని ఏర్పాటుచేశారు. అందులో మన ఫుడ్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎంత సమయం పడుతుంది. వండే ప్రక్రియ ఎక్కడి వరకూ వచ్చింది. ఇలాంటి పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ప్రస్తుత సమాజంలో తీవ్ర స్థాయిలో చూపిస్తుందని చెప్పాలి. మన్నటి వరకూ మొహాలు మార్చడం, ఉన్నది లేనట్లుగా చూపించడం వరకే పరిమితం కాకుండా ప్రజా ప్రయోజనానికి కూడా దీని సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇది ఇలాగే వదిలేస్తే సమాజ పరిస్థితుల్ని ఎక్కడి వరకూ తీసుకెళ్తుందో.. దీని ప్రభావం సమాజంపై ఎలా దారితీస్తుందో తెలుసుకోవాలంటే వేచిచూడక తప్పదు.

 

T.V.SRIKAR