Cool Drinks: కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..!
సమ్మర్ కాకపోయినా కొందరు మాత్రం అదేదో డ్యూటీలా కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తాగుతుంటారు. అలాంటివాళ్లందరికీ ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇలా కూల్‌డ్రింక్స్ తాగడం అంత సేఫ్ కాదట. కూల్‌డ్రింక్స్‌లో వాడే యాడెడ్ షుగర్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు డాక్టర్లు.
Cool Drinks: సమ్మర్ వచ్చిందంటే చాలు.. కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తుంటారు చాలా మంది. ఆరోగ్యానికి మంచి చేసే కొబ్బరినీళ్లు వదిలేసి టేస్ట్‌గా ఉంటుందని కూల్‌డ్రిక్స్ తాగుతుంటారు. సమ్మర్ కాకపోయినా కొందరు మాత్రం అదేదో డ్యూటీలా కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తాగుతుంటారు. అలాంటివాళ్లందరికీ ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఇలా కూల్‌డ్రింక్స్ తాగడం అంత సేఫ్ కాదట. కూల్‌డ్రింక్స్‌లో వాడే యాడెడ్ షుగర్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు డాక్టర్లు. అస్పర్టెమ్ అనే నాన్-షుగర్ స్వీటెనర్ అందుకు ప్రధాన కారణమని WHO రీసెంట్‌గా నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఈ అస్పర్టెమ్‌ను ప్రపంచంలో తయారయ్యే అన్ని కూల్‌డ్రింక్స్‌లో ఉపయోగిస్తున్నట్టు WHO గుర్తించింది. ఇది తక్కువ కాలెరీలు ఉండే ఆర్టిఫిషియల్ షుగర్. సుక్రోజ్ కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కోకా-కోలా, డైట్ సోడాలు, మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్, కొన్ని రకాల స్నాపిల్ డ్రింక్స్ వంటి పలు ఉత్పత్తుల్లో అస్పర్టెమ్ వినియోగిస్తుంటారు.
అస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాలనైన్ అనే రెండు అమైనో ఆమ్లాలతో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్‌ను తయారు చేస్తారు. అస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాలనైన్‌తోపాటు కొద్ది మొత్తంలో మిథనాల్ కూడా ఉంటుంది. కార్బోనేటేడ్ డ్రింక్స్‌తో పాటు కొన్ని ఫ్రూట్ జూస్‌లు, ఆహార పదార్థాల్లో కూడా ఈ అస్పర్టమెస్ ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలను, కూల్‌డ్రింక్స్‌ను దూరం పెడితేనే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.