చుట్టూ వరద.. కారెక్కి ముచ్చట్లు.. వీళ్లు మాములోళ్లు కాదు బాస్..
దేశవ్యాప్తంగా వానలు అతలాకుతలం చేస్తున్నాయ్. నాన్‌స్టాప్ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయ్. గుజరాత్‌లో వానలు దంచికొడుతున్నాయ్.
దేశవ్యాప్తంగా వానలు అతలాకుతలం చేస్తున్నాయ్. నాన్‌స్టాప్ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయ్. గుజరాత్‌లో వానలు దంచికొడుతున్నాయ్. సబర్‌కాంత జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయ్. ఐతే ఈ వరదలో ఓ జంట చిక్కుకుంది. రెండు గంటలు ఆ ఇద్దరు కారు రూఫ్ ఎక్కి గడిపిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరద తక్కువగా ఉందనుకున్న దంపతులు.. కారుతో కాజ్‌వేను దాటే ప్రయత్నం చేశారు. ఐతే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు నదిలో కొట్టుకుపోయింది. ఓ చోట రాళ్ల మధ్యలో చిక్కుకుపోవడంతో.. దింపతులిద్దరూ కారు టాప్ పైకి ఎక్కారు. దాదాపు రెండు గంటల పాటు కారు టాప్ పైనే ఉండిపోయారు. చివరకు పోలీసులు వచ్చి.. రెస్క్యూ చేశారు. ఈ ఘటనను అక్కడి జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. కారు కాజ్‌వే నుంచి ఒకటిన్నర కిలోమీటర్ కొట్టుకుపోయింది. అయినా ఆ దంపతులు టెన్షన్ పడలేదు. ధైర్యంగా కారు టాప్ ఎక్కి కూర్చున్నారు. ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఏదో ఈవినింగ్ వాకింగ్‌లో పరిచయం అయినట్లు.. ఇంటి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నట్లు.. ఆ వరదలో.. ఆ కారు రూఫ్ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఫోన్ చూస్తుండడం.. ఆమె ఏదో చెప్తున్నట్లు కనిపించడం.. చుట్టూ చావు ఎదురుచూస్తుందని తెలుస్తున్నా.. ఇంత భయం లేదేంటి వీళ్లకు అనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఇవి మాములు గుండెలు కాదు.. ఈ గుండెలు బతకాలి.. ఈ ధైర్యం పది మందికి ధైర్య అవుతుంది అంటూ.. ఫన్నీ కామెంట్స్ పెడుతున్న వాళ్లు కొందరు అయితే.. భయంతో కంగారు పడిపోకుండా.. ధైర్యంగా కారు మీద ఉన్న వాళ్ల మీద ప్రశంసలు గుప్పిస్తున్న వారు మరికొందరు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.