Corona: టెన్షన్‌ పెడుతున్న కరోనా వైరస్‌.. 24 గంటల్లో 10,158 కొత్త కేసులు..

కరోనా అవుట్‌బ్రేక్‌ ఇండియాను మరోసారి షేక్‌ చేస్తోంది. కంట్రోల్‌ లేకుండా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రెండు వారాల మందు వరకూ వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 10 వేల 158 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజెంట్‌ ఇండియాలో ఉన్న యాక్టివ్‌ కరోనా కేసుల కౌంట్‌ 44 వేల 998కి చేరింది. రికార్డ్‌ స్థాయిలో ఒకే రోజు 19 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. నిన్న కూడా సుమారు 7 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 04:30 PMLast Updated on: Apr 13, 2023 | 4:30 PM

Covid Cases In India

నిన్నటితో కంపేర్‌ చేస్తే 30 పర్సెంట్‌ కరోనా కేసులు పెరిగాయి. దీంతో మరోసారి లాక్‌డౌన్‌ భయాలు ప్రజల్లో పెరిగిపోతున్నాయి. రెండేళ్ల ముందు కూడా కరోనా అవుట్‌బ్రేక్‌ ఇలాగే ప్రారంభమైంది. చూస్తుండగానే కేసుల సంఖ్య ఆకాశాన్నంటింది. ఎండాకాలంలో కరోనా వ్యాపించదన్నారు. మన దగ్గర ఉండే టెంపరేచర్‌కు అసలు కరోనా వైరస్‌ బతికి ఉండదన్నారు. కానీ ఇవన్నీ జస్ట్‌ మాటలే అని కొన్ని రోజుల్లోనే ప్రూవ్‌ అయింది. నెల రోజుల గ్యాప్‌లో దేశం మొత్తాన్ని మిక్సీ పట్టేసింది వైరస్‌. సిచ్యువేషన్‌ ఎంతలా మారిపోయిందంటే.. ఇక లాక్‌డౌన్‌ తప్ప వేరే ఆప్షన్‌ లేదు అని సెంట్రల్‌ గవర్నమెంట్‌ చేతులెత్తేసింది.

పారాసిటమాల్‌ వేసుకుంటే చాలు వైరస్‌ రాదు అన్న తెలంగాణ గవర్నమెంట్‌ కూడా.. లాక్‌డౌన్‌ ఎనౌన్స్‌ చేసింది. అప్పుడు కూడా ఇలాగే వందల్లో మొదలైన కేసులు.. చూస్తుండగానే వేలకు లక్షలకు రీచ్‌ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే సీన్‌ మళ్లీ రిపీట్‌ అవుతోంది. ప్రతీ రోజు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. కరోనా నుంచి కోలుకుంటున్నవాళ్ల నెంబర్‌ కంటే.. కొత్తగా కరోనా బారిన పడుతున్నవాళ్ల నెంబర్‌ ఎక్కువవుతోంది. ఈ సిచ్యువేషన్‌ ఇలాగే కంటిన్యూ అయితే. మళ్లీ పరిస్థితి చేదాటిపోతుందనే భయాలు కనిపిస్తున్నాయి. గత అనుభవాలను బేరీజు వేసుకుని.. ఇప్పుడు సిచ్యువేషన్‌ కంట్రోల్‌ చేయకపోతే మరోసారి లాక్‌డౌన్‌ తప్పేలా లేదు.