Cyclone Midhili: ముంచుకొస్తున్న మిధిలీ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు తప్పదా..?
ఈ నెల 18 నాటికి.. తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 17 నాటికి.. మిధిలీ తీవ్ర తుఫాన్‌గా మారుతుందని.. 24గంటల్లో అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారుతుందని.. ఆ తర్వాత తీవ్రత తగ్గి తీరం దాటే సమయంలో తుఫాన్‌గా మారనుందని అధికారులు చెప్తున్నారు.

Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు మిధిలీగా పేరు పెట్టారు. ఆ తుఫాన్ భీకరంగా మారుతోంది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో.. ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు ప్రయాణిస్తోంది. ఈ నెల 18 నాటికి.. తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 17 నాటికి.. మిధిలీ తీవ్ర తుఫాన్‌గా మారుతుందని.. 24గంటల్లో అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారుతుందని.. ఆ తర్వాత తీవ్రత తగ్గి తీరం దాటే సమయంలో తుఫాన్‌గా మారనుందని అధికారులు చెప్తున్నారు.
Heavy Rain In AP : నేడు తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
ప్రస్తుతం సముద్ర తీరానికి 380 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. రాబోయే 24 గంటల్లో ఇది దిశ మార్చుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మిధిలీ తుఫాన్ ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అయితే, తెలంగాణకు తుఫాన్ ముప్పు లేదని.. కాకపోతే అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిధిలీ తుఫాన్.. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని.. ఏపీకి తుఫాన్ ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో.. నవంబర్ 18 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అధికారులు.
తీరం దాటే సమయంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని తెలిపింది. ఇక అటు బంగ్లాదేశ్‌లో ఈ మధ్యే ఓ తుఫాన్ తీరం దాటి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఇంతలోనే మరో తుఫాన్ గండం పొంచి ఉండటంతో.. ఆ దేశ జనాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వణికిపోతున్నారు.