కరోనాలో కొత్త వేరియంట్‌ మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా ?

ప్రపంచానికి మరోసారి కరోనాతో ముప్పు పొంచి ఉందా ? ఇప్పుడు జాగ్రత్త పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా ? ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానమే నిపుణుల నుంచి వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 06:11 PMLast Updated on: Aug 31, 2024 | 6:11 PM

Danger Bells With Corona New Variant

ప్రపంచానికి మరోసారి కరోనాతో ముప్పు పొంచి ఉందా ? ఇప్పుడు జాగ్రత్త పాటించకపోతే మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా ? ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానమే నిపుణుల నుంచి వినిపిస్తోంది. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ నిపుణులు చేసిన ఓ ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి కరోనా భయంలోకి నెట్టేసింది. కరోనాలోని ఒమిక్రాన్‌ రకం నుంచి KP పేరుతో కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్నట్టు CDC నిపుణులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌ ఇండియాతో పాటు అమెరికా, సౌత్‌ కొరియాలో విపరీతంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. గతంలో నేర్చుకున్న పాఠాలతో ఈ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు, ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటే మంచిదని చెప్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి జులై మధ్య కాలంలో ఈ వేరియంట్‌ పెరుగుదల క్రమంగా కనిపించిందట. దాదాపు 85 దేశాల్లో 17 వేల 385 మందికి టెస్ట్‌లు చేశామని డాక్టర్లు చెప్తున్నారు. ఇందులో చాలా శాంపిల్స్‌లో KP వేరియంట్‌ పెరుగుదల కనిపించిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ వేరియంట్‌కు సంబంధించి 908 కేసులు ఇండియాలో నమోదైనట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ వేరియంట్‌ ఇప్పటికే ఇండియాలో ఇద్దరి ప్రాణాలను మింగేసింది. మిగిలిన దేశాలతో కంపేర్‌ చేస్తే.. ఈ వైరస్‌ వ్యాప్తి మన వాతావరణంలో ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్నది డాక్టర్లు చెప్తున్న మాట. ఒక వేళ ఇదే గనక జరిగితే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.