Deepika baby bump: బేబి బంప్‌తో దీపిక పదుకొనే
బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కడం.. పిల్లలను కనడం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్టులో దీపిక పదుకొనె కూడా చేరింది. ఆరేళ్ల క్రితం తన సహ నటుడు రణ్‌వీర్ సింగ్ ను వివాహం చేసుకున్న దీపిక.. పెళ్లి తర్వాత మరింత దూకుడుగా సినిమాలు చేసింది. అయితే.. ఈసారి పిల్లలకోసం సమయాన్ని కేటాయించింది. మరికొన్ని నెలల్లోనే దీపిక పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.

మూడు నెలల క్రితం తన ప్రిగ్నెన్సీని అనౌన్స్ చేసింది దీపిక. ఈ మూడు నెలలపాటు తన బేబి బంప్ ఫోటోలను బయటకు రానివ్వలేదు. తాజాగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయడానికి ముంబైలోని పోలింగ్ కేంద్రానికి భర్త రణ్‌వీర్ తో కలిసి వచ్చింది దీపిక పదుకొనె. ఈ సందర్భంగా.. దీపిక బేబి బంప్ స్పష్టంగా కనిపించింది. దీపికా కారు దిగినప్పటి నుంచీ భర్త రణ్‌వీర్ ఆమె వెంటే ఉంటూ జాగ్రత్తగా ఆమెను పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లాడు. ఈ సమయంలో దీపికా తన బేబీ బంప్ పై చేయి వేసి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లింది.
మరోవైపు.. దీపిక పదుకొనె ‘కల్కి 2898 ఎ.డి.’తో పాటు బాలీవుడ్ లో ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే ‘కల్కి’లో దీపిక పోర్షన్ కంప్లీట్ అయ్యింది. ‘సింగమ్’ సిరీస్ లో రాబోతున్న ‘సింగమ్ ఎగైన్’లోనూ దీపిక క్యారెక్టర్ కి సంబంధించి షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. ‘కల్కి’ చిత్రం జూన్ 27న వస్తుంటే.. ‘సింగమ్ ఎగైన్’ ఆగస్టు 16న విడుదలకు ముస్తాబవుతోంది.