Diwali 2023: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళికి వరుస సెలవులు..!
మొదట ఆదివారమే దీపావళిగా భావించి, సెలవు ప్రకటించినప్పటికీ.. తర్వాత పండితుల సూచనతో సోమవారం నాడు దీపావళి సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో శని, ఆది, సోమ వారాలు.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి.

Diwali 2023: దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలి అనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఒక రకంగా కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఇది గుడ్ న్యూసే. కారణం.. దీపావళి సెలవులు. దీపావళి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. నవంబర్ 11న రెండో శనివారం కావడంతో విద్యాసంస్థలకు ఎలాగూ సెలవు ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆదివారం సాధారణ సెలవు. ఇక సోమవారం, నవంబర్ 13న దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.
PAWAN KALYAN: ఇదీ పవన్ రేంజ్.. పవన్ కళ్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి..!
మొదట ఆదివారమే దీపావళిగా భావించి, సెలవు ప్రకటించినప్పటికీ.. తర్వాత పండితుల సూచనతో సోమవారం నాడు దీపావళి సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో శని, ఆది, సోమ వారాలు.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. విద్యార్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు, కొన్ని ప్రైవేటు సంస్థలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. దీంతో దసరా తర్వాత చాలా మందికి మరోసారి కుటుంబంతో గడుపుతూ, విశ్రాంతి తీసుకునే అవకాశం దొరికినట్లైంది. ఈ నేపథ్యంలో చాలా మంది నగరాల నుంచి శుక్రవారమే సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో కొన్ని చోట్ల రహదారులపై ట్రాఫిక్ జాంలు కూడా కనిపిస్తున్నాయి.