Donald Trump: 3 పెళ్లిళ్లు.. 8 మందితో డేటింగ్స్.. రసిక శిఖామణి డొనాల్డ్ ట్రంప్
ఎంతటి రసికుడవో తెలిసెరా..నువ్వెంతటి రసికుడివో తెలిసెరా.. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితం గురించి చదవడం మొదలుపెడితే.. ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట ఎవరికైనా గుర్తుకొస్తుంది. నిజంగానే ట్రంప్ మహా రసికుడు.
ఎంతటి రసికుడవో తెలిసెరా..నువ్వెంతటి రసికుడివో తెలిసెరా.. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితం గురించి చదవడం మొదలుపెడితే.. ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట ఎవరికైనా గుర్తుకొస్తుంది. నిజంగానే ట్రంప్ మహా రసికుడు. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అన్నట్టు ట్రంప్‌ది సంపన్నుల కుటుంబం.. డబ్బుకు కొదవలేదు..చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టి ట్రంప్ పేరుతో బిజినెస్ బ్రాండ్‌నే క్రియేట్ చేశాడు. రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టకముందే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా ఉండేవారు.ట్రంప్ పలానా వాళ్లతో డేట్ చేశారని.. ట్రంప్ పలానా హోటల్‌లో ఓ మోడల్‌తో గడిపారని.. ఇలా ట్రంప్ ఎఫైర్స్ గురించి కథలుకథలుగా ఇప్పటికి చెప్పుకుంటారు.
మాజీ అడల్ట్ స్టారీ స్టోమీ డానిల్స్‌తో ఉన్న సెక్సువల్ రిలేషన్ చివరకు ట్రంప్‌కు కోర్టు బోనెక్కేలా చేసింది. అమెరికా చరిత్రలోనే క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచిన ట్రంప్ అడల్ట్ స్టార్‌తో రిలేషన్ లేదని కొట్టిపడేస్తున్నా.. ఆయన శృంగార జీవితం ఎలాంటిదో.. ఆయన జీవితంలో ఎంత మంది మహిళలు ఉన్నారో అమెరికాలో ఎవరినడిగినా చెప్పేస్తారు.
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు
పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం అమెరికన్ల జీవితాల్లో సర్వసాధారణం. ట్రంప్ కూడా అంతే. ఇప్పటి వరకు ట్రంప్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1977లో ఇవానాను పెళ్లి చేసుకున్న ట్రంప్ ఆమెతో 1992 వరకు కాపురం చేశారు. వీళ్లిద్దరికీ ముగ్గురు పిల్లలు, వాళ్లకు తొమ్మిది మంది పిల్లలు. ఇవానాతో కలిసిండగానే ట్రంప్ మార్లా మాపుల్స్‌తో ప్రేమలో పడ్డారు. 1993లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆరేళ్లు మాత్రమే ట్రంప్ మార్లాతో కలిసి ఉన్నారు. ట్రంప్ తనకు బెస్ట్ సెక్స్ లైఫ్ అందించారంటూ మార్లా ఓపెన్‌గానే చెప్పుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో టాప్ మోడల్‌గా ఉన్న మెలానియాతో ప్రేమాయణం నడిపిన ట్రంప్ ఆమెను 2005లో పెళ్లి చేసుకున్నారు.
ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్స్ ఎంతమందో..!
ట్రంప్ జీవితంలోకి అధికారికంగా భార్యలుగా వచ్చింది ముగ్గురే అయినా ఆయన డేటింగ్ చేసిన అమ్మాయిల జాబితా మాత్రం పెద్దదే. భార్యలు వస్తుంటారు..పోతుంటారు.. గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుండాలి.. ఇది ట్రంప్ ఫిలాసఫీ. అందుకే కాస్త చనువుగా ఉన్న ప్రతి అమ్మాయితోనూ ట్రంప్ డేటింగ్ చేసేవారంటూ రూమర్లు షికారు చేసేవి.
Kara Young
కారా యంగ్ అనే మోడల్‌తో ట్రంప్ 2001లో డేటింగ్ చేశారు. వీళ్ల రిలేషన్ రెండేళ్ల పాటు సాగింది.
Kylie Bax
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ట్రంప్‌పై ఆరోపణలు గుప్పుమన్న సమయంలో ఆయన కైలీ బాక్స్ అనే మోడల్‌తో రిలేషన్ కొనసాగించారు.
Rowanne Brewer Lane
బ్రెవర్ లానా అనే 26 ఏళ్ల మోడల్‌తోనూ ట్రంప్ సంబంధం పెట్టుకున్నారు. ఓ పూల్ పార్టీలో కలిసిన వీళ్లిద్దరూ కొంతకాలం పాటు సన్నిహితంగా ఉన్నారు.
Gabriela Sabatini
రెండో భార్య మాపుల్స్‌తో రిలేషన్‌లో ఉన్న సమయంలోనే మూడోకంటికి తెలియకుండా టెన్నిస్ స్టార్ గాబ్రెలా సబాటినీతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నారు ట్రంప్. అయితే వీళ్ల మధ్య సంబంధం నెలకు మించి లేదు.
Allison Giannini
50 ఏళ్ల వయసులో 27 ఏళ్ల మోడల్‌తో డేటింగ్ చేశారు ట్రంప్. 1997లో ఆలిసన్ గియానినితో సన్నిహితంగా మెలిగారు. ట్రంప్‌ను ఆమె పరఫెక్ట్ పరఫెక్ట్ జెంటిల్‌మెన్ అంటూ వెనకేసుకొచ్చేది.
Candice Bergen
కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి ట్రంప్ జీవితంలోకి తొంగి చూస్తే ఎమ్మీ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ Candice Bergenతో కూడా ట్రంప్ కు ఎఫైర్ ఉండేది.
Anna Nicole Smith
మీడియా వ్యాపారంలోనూ అడుగుపెట్టిన ట్రంప్ టీవీ స్టార్ అన్న నికోల్ స్మిత్‌తో డేటింగ్ చేశారు.
Carla Bruni
ట్రంప్ ఎఫైర్స్ అక్కడితో ఆగలేదు. ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భార్య, సింగర్- సాంగ్ రైటర్ బ్రూనీతోనూ ట్రంప్‌కు ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి . అయితే వీటిని బ్రూనీ ఖండించారు. తాను ట్రంప్‌ను ఒక్కసారి మాత్రమే కలిసినట్టు ప్రకటించారు.
మొత్తానికి ట్రంప్‌ది రొమాంటిక్ కలర్‌ఫుల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఓ వైపు వ్యాపారాలు, మరోవైపు రాజకీయాలు.. ఇంకోవైపు వ్యక్తిగత జీవితంలో ప్రేమాయణాలు. కట్టుకున్న భార్యల నుంచి ప్రియురాళ్ల వరకు ఎవరు ఏమనుకున్నా.. తనకు నచ్చిన గర్ల్ కనిపిస్తే ట్రంప్ వదిలిపెట్టే వారు కాదన్నది మాత్రం రియాల్టీ.
(HYMA)