Health Issues: ఎక్కువసేపు ఓకే దగ్గర కూర్చుంటున్నారా ?
ఈరోజుల్లో దాదాపు అంతా చేసే జాబ్స్ ఒక దగ్గర కూర్చొని చేసేవే. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ అయితే ఎటూ కదలడానికి ఉండదు. క్లైంట్ కాల్, జూమ్ మీటింగ్ ఉంటే గంటలతరబడి ఒకే దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది. ఇంట్లో కూడా చాలా మంది ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుంటారు. నిజానికి ఇలా కూర్చోవడం ఆరోగ్యానికి చాలా హానికరమంటున్నారు డాక్టర్లు.
చాలా సేపు ఒకే దగ్గర కూర్చొని ఉండటంవల్ల శరీరంలో కదలికలు తగ్గి బాడీ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందట. కొంత మంది కాసేపు ఒకే యాంగిల్‌లో కూర్చోగానే కాళ్లు, నడుము పట్టేయడానికి ఇదే కారణమంటున్నారు డాక్టర్లు. ఇలాగే గంటల తరబడి కూర్చోవడం వల్ల షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే చాన్స్ ఉందట. ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల గుండె, రక్తనాళ వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.
ఎంత బిజీగా ఉన్నా మధ్య మధ్యలో రిలీఫ్ అయ్యేందుకు అటూ ఇటూ నడవటం మంచిది అంటున్నారు డాక్టర్లు. ఒకే దగ్గర ఎక్కువ సమయం కూర్చుంటే బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ ఫ్లాట్స్, బ్లడ్ ప్రెజర్ శరీర బరువు, పొత్తికడుపులోని కొవ్వును పెంచుతుందట. రోజంతా కూర్చొని పని చేసేవారిలో శారీరక శ్రమ, కండరాల బలహీణత ఎక్కువగా ఉంటుందట. బ్లడ్ సర్క్యూలేషన్ స్లోగా జరిగి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. వీలు దొరికిన ప్రతీసారి కాసేపు నడవటం బెటర్ అంటున్నారు.