Condom Testers: కండోమ్ టెస్టర్లకు డ్యురెక్స్ ఆహ్వానం.. 50 మందికి అవకాశం..!
ఈ సంస్థ త్వరలో డ్యురెక్స్ న్యూడ్ పేరుతో కొత్త కండోమ్స్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఈ కండోమ్స్ ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న అన్నింటికంటే చాలా సన్నగా ఉంటాయి. అలాగే ఇన్నోవేటివ్‌గా వీటిని తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
Condom Testers: కండోమ్ టెస్టర్లకు ఆహ్వానం పలుకుతోంది ప్రముఖ కండోమ్ బ్రాండ్ డ్యురెక్స్. కండోమ్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త రకం వాటిని ఆవిష్కరిస్తూ, వినియోగదారుల ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సేఫ్ సెక్స్ కోసం వీటిని వాడుతుంటారు. అయితే, ఇప్పటికీ వీటిని వాడే వారి సంఖ్య చాలా తక్కువ. దీనికి చాలా కారణాలున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ అక్కడ కండోమ్స్ వినియోగంపై చేసిన సర్వేలో గుర్తించిన విషయాలపై ఫోకస్ చేసింది.
బ్రిటన్‌లో 62 శాతం మంది కండోమ్స్ వాడటం లేదు. వీటిని మూడ్ కిల్లర్స్‌గా పేర్కొంటూ కొంతమంది, వీటి వాడకం వల్ల అసౌకర్యంగా ఉంటుందని ఇంకొందరు.. ఇలా కొన్ని కారణాలతో కండోమ్స్ వాడటం లేదు. వారి నుంచి వచ్చిన సలహాల ఆధారంగా, అందరికీ మరింత నచ్చేలా కొత్త రకం కండోమ్స్ తయారు చేసింది డ్యురెక్స్. ఈ సంస్థ త్వరలో డ్యురెక్స్ న్యూడ్ పేరుతో కొత్త కండోమ్స్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఈ కండోమ్స్ ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న అన్నింటికంటే చాలా సన్నగా ఉంటాయి. అలాగే ఇన్నోవేటివ్‌గా వీటిని తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. వీటి కోసం తమ సంస్థ చాలా ఖచ్చు చేసిందని, వీటిని వాడటం వల్ల సరైన ఆనందాన్ని పొందుతారని కంపెనీ తెలిపింది. ఈ కండోమ్స్‌ని మార్కెట్లోకి తేవడానికి ముందు పరీక్షించాలని అనుకుంటోంది. దీనికోసం 50 మందిని ఎంపిక చేయబోతుంది. ఈ నెల 21 వరకు 50 మందిని ఎంపిక చేసుకోబోతుంది. దీనికి ఎంపికైన వాళ్లు ఆ కండోమ్స్ వాడి ఓపెన్, జెన్యూన్ రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ రివ్యూ ఇచ్చిన వారికి 100 పౌండ్లు ఇవ్వబోతుంది. అంటే మన కరెన్సీలో రూ.10 వేలకుపైనే వస్తుంది. బ్రిటన్‌లో మధ్య వయసు దాటిన వాళ్లు సంవత్సరానికి 94సార్లు శృంగారంలో పాల్గొంటే, 18 నుంచి 34 ఏళ్ల వయసు కలిగిన వాళ్లు 140 సార్లు శృంగారంలో పాల్గొంటున్నారు. వీరిలో చాలా మంది సగటున నలుగురితో సంబంధం కలిగి ఉన్నారు. అందులోనూ పది మందిలో ఒక్కరు మాత్రమే కండోమ్ వాడుతున్నట్లు తేలింది. వీళ్ల సూచనల ఆధారంగానే తాజాగా సున్నితంగా ఉండే కండోమ్స్ తయారు చేసింది డ్యురెక్స్ సంస్థ. ఇవి డ్యురెక్స్ న్యూడ్ పేరుతో మార్కెట్లోకి రానున్నాయి.