Paracetamol: బ్రిటన్‌లో పారాసిటమల్ ట్యాబ్లెట్ల అమ్మకాలపై ఆంక్షలు.. కారణమిదే..!
బ్రిటన్‌లో ఆత్మహత్యల అంశంపై అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఆత్మహత్యల్ని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో 2018 నుంచి సూసైడ్స్ సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో సూసైడ్ నివారణ చేపట్టాలని భావిస్తోంది.
Paracetamol: జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి వాటికి చాలా మామూలుగా వాడే పారాసిటమల్ ట్యాబ్లెట్లపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. ఆత్మహత్యల్ని నివారించే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకుంటున్నట్లు బ్రిటన్ తెలిపింది. బ్రిటన్‌లో ఆత్మహత్యల అంశంపై అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఆత్మహత్యల్ని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో 2018 నుంచి సూసైడ్స్ సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో సూసైడ్ నివారణ చేపట్టాలని భావిస్తోంది.
ఈ మేరకు రాబోయే రెండున్నరేళ్లలో ఆత్మహత్యల్ని నివారిస్తామని అక్కడి మంత్రులు నిర్ణయించారు. ఆత్మహత్యలకు కారణమవుతున్న అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా పారాసిటమల్ ట్యాబ్లెట్ల అమ్మకాలపై ఆంక్షలు విధించారు. పారాసిటమల్ ట్యాబ్లెట్లు చాలా సులభంగా దొరుకుతుంటాయి. ప్రస్తుతం అక్కడ ఒక్కరికి రెండు షీట్లు కొనుగోలు చేసే వీలుంది. అంటే 500 ఎంజీ సామర్ధ్యం కలిగిన 16 ట్యాబ్లెట్లను కొనుక్కోవచ్చు. ఒక్కో షీట్‌కు ఎనిమిది ట్యాబ్లెట్లు వస్తాయి. ఈ ట్యాబ్లెట్లను బ్రిటన్‌లో చాలా మంది ఆత్మహత్య కోసం వాడుతున్నారు. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయి చనిపోతున్నారు. అందుకే వీటి అమ్మకాలపై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
అక్కడి ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ డ్రగ్ అనే కాదు.. అపరిమితంగా తీసుకుంటే ఏ మందైనా ప్రమాదకరమే. ట్యాబ్లెట్లు వైద్యుల సలహా మేరకు, పరిమిత సంఖ్యలోనే అమ్మాలని హెల్త్ కేర్ ఉత్పత్తుల విక్రయదారులకు సూచించింది. దీనివల్ల ఆత్మహత్యల సంఖ్య ఇంకా తగ్గుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.