కొండచిలువతో బిర్యానీ ఈ రీసెర్చ్ గురించి తెలిస్తే మైండ్ పోద్ది!!!
పాము కనిపిస్తే పారిపోవడమే మనకు తెలుసు. కానీ మీ ఇంట్లో లేదా హోటల్‌లో.. చికెన్, మటన్‌తో పాటు పైథాన్ బిర్యానీ కూడా ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా.
పాము కనిపిస్తే పారిపోవడమే మనకు తెలుసు. కానీ మీ ఇంట్లో లేదా హోటల్‌లో.. చికెన్, మటన్‌తో పాటు పైథాన్ బిర్యానీ కూడా ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా. బట్ ఇదే ఫ్యూచర్ కాబోతోంది. ఆస్ట్రేలియాలోని మాక్వేరీ అనే యూనివర్సిటీ చేసిన ఓ స్టడీలో ఈ విషయం బయటకు వచ్చింది. చికెన్‌తో కంపేర్ చేస్తే పైథాన్స్‌లో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయంట. అంతే కాదు.. కోళ్లు మేకల్ని పెంచడంతో కంపేర్ చేస్తే పైథాన్‌లను పెంచడం చాలా ఈజీ అని చెప్తున్నారు. దాంతో పాటు పైథాన్స్‌లో వేస్టేజ్ దాదాపుగా ఉండదు. 82 శాతం పైథాన్ మాంసంగానే ఉంటుంది. మాంసం కంటే పైథాన్ చర్మానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి చర్మం కూడా వేస్ట్ అవ్వదు. నిజానికి నార్త్ ఏషియన్ కంట్రీస్‌లో చాలా మంది పైథాన్స్‌ను స్కిన్ కోసం పెంచుతున్నారు. పైథాన్ స్కిన్‌తో బెల్ట్, బ్యాగ్స్, జాకెట్స్ లాంటి లగ్జరీ వేర్ తయారు చేస్తున్నారు.
బట్ ఇదే సమయంలో పైథాన్ మాంసానికి కూడా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. పైథాన్ మాంసానికి ఈ డిమాండ్ పెరగడానికి కారణం దాంట్లో ఉండే ప్రోటీన్. పైథాన్ మాంసంలో ప్రొటీన్లు ఎక్కువగా ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇలా ఇలాంటి ఫుడ్ తయారు చేసేందుకు చాలా మంది ఏవేవో చేస్తుంటారు. కానీ పైథాన్ మాంసంలో ఇది నేచురల్‌గా ఉంటుంది. పాములను తినడం అనేది మనకు కొత్తగా ఉన్నా చాలా దేశాల్లో ఇప్పటికే చాలా మంది వాళ్ల ఫుడ్ మెనూలో పాములను చేర్చారు. కానీ అన్ని పాముల కంటే పైథాన్ మీట్ చాలా ఫాస్ట్‌గా లీడింగ్‌లోకి వస్తోంది. అందుకే నార్త్ ఏషియా కంట్రీస్‌లో చాలా మంది పైథాన్ ఫార్మింగ్ చేస్తున్నారు. కోళ్లు మేకలను పెంచడం కంటే పైథాన్లను పెంచడం చాలా ఈజీ. పైథాన్లు సైజ్‌లో పెద్దగా ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా కదిలే అంత పెద్ద బాక్సులు ఏర్పాటు చేస్తే చాలు. అండ్ పైథాన్ మాంసంతో పాటే వాటి చర్మానికి కూడా ఫుల్ డిమాండ్ ఉంది. కాబట్టి పైథాన్లను పెంచేటప్పుడు వాటికి ఎలాంటి గాయాలు కాకుండా చూస్తున్నారు రైతులు. కోడి మాంసం, ఎలుకలు లాంటి వాటిని పైథాన్లు ఎక్కువగా తింటాయి. వీటి చంపి పైథాన్లకు వేయడం కంటే నేరుగా వేయడానికే రైతులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే సహజంగా వేటాడే గుణం ఉన్న పైథాన్లకు ప్రాణంలో ఉన్నా ఆహారాన్ని ఇస్తే వాటి బాడీ మూమెంట్ చాలా అరోగ్యంగా ఉంటుంది.
ప్రతీ పైథాన్ రోజుకు దాదాపు 46 గ్రాములు పెరుగుతుందట. ఈ పాములు బరువు పెరగడం తప్ప తగ్గడం అనేది దాదాపు కనిపించదు. ఎలాంటి ఆహారం లేకున్నా పైథాన్లు 4 నాలుగు నెలలు బరువు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీటికి ఫీడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతే కాదు ప్రతీ పైథాన్ ఒకేసారి 10 నుంచి 100 గుడ్లు పెడుతుంది. కొన్ని రోజుల్లోనే ఆ గుడ్ల నుంచి బేబీ పైథాన్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే పైథాన్ ఫార్మింగ్ మార్కెట్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతోంది. మారుతున్న జీవిన విధానంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో పైథాన్ ఫుడ్ కామన్ ఐపోయింది. నార్త్ ఇండియాలో కూడా ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే మొదలువుతోంది. సౌత్‌లో ఈ ఫుడ్ ఎప్పుడు రెస్టారెట్ల మెనూలో చేరుతుందో చూడాలి.