Sim Verification: మీ ఆధార్ తో ఎన్ని సిమ్ కార్డులు యాక్టీవ్ లో ఉన్నాయో తెలుసుకోండిలా..

మొబైల్ నెట్వర్క్ ద్వారా సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ఒక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మీ ఆధార్ తో ఎన్ని సిమ్ కార్డులు యాక్టివేట్ లో ఉన్నాయో తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 12, 2023 | 02:49 PMLast Updated on: Aug 12, 2023 | 2:49 PM

Find Out How Many Sim Cards Are On Your Aadhaar Card

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రెండు లేదా మూడు సిమ్ కార్డులు వినియోగిస్తున్నారు. తమ వ్యక్తిగత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ అవసరాలకు ఒకటి, ఆఫీస్ అవసరాలకు, బయటి వ్యక్తుల మధ్య సంభాషణలు జరిపేందుకు ఇలా వివిధ కారణాల దృష్ట్యా పలు రకాల నెట్వర్క్ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కొందరు అయితే ఆఫర్ల పేరిట పదేసి సిమ్ లను కొనుగోలు చేసి వాటిని వినియోగించినన్నినాళ్లు వినియోగించి ఆతరువాత పక్కన పడేస్తున్నారు. దీంతో ఆ నంబర్లు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తున్నాయి. వీటిని కొందరు సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకొని అసాంఘీక కార్యకలాపాలకు, చట్టవిరుద్దమైన పనులకు వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని టెలీ కమ్యూనికేషన్ శాఖ సరికొత్త వెబ్ సైట్ ను ఏర్పటు చేసింది. దీని లోకి లాగిన్ అయితే మనం ప్రస్తుతం ఎన్ని సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నాము, లేదా మన సిమ్ ఎంత మంది దగ్గర ఉంది, ఈ సిమ్ మనకు అవసరమా, అవసరం లేదా ఇలా రకరకాలా ఆఫ్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మన ఫోన్ నంబర్ మన ఆధీనంలో సుక్షితంగా ఉందా లేదా అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చు.

ఇప్పటి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తూ ఉంటారు. ఏపని చేయాలన్నా ఆన్ లైన్ లోనే చేసేస్తూ ఉంటారు. ఇవే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తుంది. ఒక్కోసారి మన నంబర్లను డీ యాక్టివేట్ స్థితి నుంచి యాక్టివేట్ చేసుకొని ఆర్థిక, సామాజిక నేరాలకు పాల్పడుతూ ఉంటారు. అందుకే మనం ఉపయోగించని, మనకు అవసరం లేని నంబర్లను ఎప్పటికప్పుడు బ్లాక్ చేసుకోవాలి. ఇన్నాళ్లు లేని ఈ నంబర్ వెరిఫికేషన్ ప్రక్రియను ఇప్పుడు ఎందుకు అందుబాటులోకి తెచ్చారనే అనుమానం మీలో కలుగవచ్చు. తాజాగా విజయవాడ వేదికగా ఒకే ఫోటోద్వారా 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిని టెలీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ప్రస్తుత ఆర్టిఫీషియల్ సాంకేతికతను అందిపుచ్చుకొని కనుగొంది. అందులో భాగంగానే రీ-వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది. ఒక వ్యక్తికి 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకునేందుకు వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ అవసరం అయితే రీ వెరిఫికేషన్ చేపట్టాలని తెలిపింది. మీ ఫోన్ నంబర్ల సహాయంతో మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా ఒక వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా..

  • ముందు tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి.
  • వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే పోర్టల్ ఓపెన్ అవుతుంది.
  • కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే బ్లాగ్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్, నో యువర్ మొబైల్ కనెక్షన్ అనే రెండు రకాలా ఆప్షన్లు కనిపిస్తాయి.
  • వీటిలో నో యువర్ మొబైల్ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి.
  • వెంటనే మీరు వినియోగించే ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • ఆతరువాత అక్కడ పొందుపరిచిన క్యాప్చాను పొందుపరిచి వెరిఫై పై క్లిక్ చేయాలి.
  • సంబంధిత ఫోన్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది.
  • దీనిని నిమిషం వ్యవధిలోనే ఎంటర్ చేయాలి.
  • మీ పేరు మీద ఉన్న మొబైల్ నంబర్ల లిస్ట్ మొత్తం స్క్రీన్ పై చూపిస్తుంది.
  • వాటిలో మీ ఫోన్ నంబర్ కానిది ఏదైనా కనిపిస్తే వాటిని సెలక్ట్ చేసి అక్కడున్న మూడు ఆఫ్షన్లలో ఏదైనా ఒకదానిపై క్లిక్ చేయవచ్చు.
  • ఇలా ఎన్ని సిమ్ కార్డులు మన పేరుతో ఉన్నాయో అతి సులువుగా తెలుసుకోవచ్చు.

T.V.SRIKAR