Earth: ఖగోళంలో పంచగ్రహ కూటమి.. ప్రళయానికి ఇది సంకేతమా ?

కరోనా తర్వాత మనిషి ఆలోచన శైలే మారిపోయింది. ఖగోళంలో చిన్న మార్పు జరిగినా.. ఆ ఆలోచన చివరికి వచ్చి ఆగేది సృష్టి అంతం దగ్గరే ! అలాంటిది ఇప్పుడు ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఐదు గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయ్. మెర్క్యూరీ, వీనస్, మార్స్, జ్యూపిటర్, యురేనస్.. ఒకే వరుసలోకి రాబోతున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2023 | 01:00 AMLast Updated on: Mar 29, 2023 | 1:00 AM

Five Planets In Single Way

సూర్యకుటుంబంలోని గ్రహాలు సూర్యుడి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయ్. ఇలా తిరుగుతూ సూర్యుడికి దగ్గరగా ఈ గ్రహాలు వస్తున్నట్లు భూమిపై నుంచి చూసేవాళ్లకు.. ఇవే ఒకే సరళరేఖలో ఉన్నాయా భ్రమ కలుగుతుంది అంతే! అందుకే ఇలా లైన్‌లో ఉన్నట్లు ఓ కూటమిలా ఏర్పడినట్లు కనిపిస్తాయ్. ఈసారి ఈ పంచ గ్రహ కూటమి చాలా ప్రత్యేకం. మిగిలిన నాలుగు గ్రహాలతో పోలిస్తే ఈ యురేనస్ భూమి పైనుంచి కనిపించనుంది. ఇది ఒక సూర్యుడి చుట్టూ తన భ్రమణాన్ని పూర్తి చేయడానికి 84 ఏళ్లు పడుతుంది. దీంతో ఓ వరుస కుదరాలంటే మళ్లీ 84 సంవత్సరాలు ఎదురుచూడాలి. మాములు కళ్లతో ఈ ఐదుగ్రహాల కూటమి చూడొచ్చు. పడమటి వైపు చూస్తే ఈ ఐదు చిన్నపాటి చుక్కల్లా కనిపిస్తాయ్.

వీనస్ మరింత ప్రకాశంవంతంగా కనిపిస్తుంది. యురేనస్ మాత్రం మాములు కంటికి కనపడకపోవచ్చు. బైనాక్యులర్స్‌తో దాన్ని చూడొచ్చు. టెలిస్కోప్ ఉంటే మాత్రం ఉంటే పంచగ్రహ కూటమి చూడొచ్చు. గ్రహాల కలయిక వల్ల ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయ్. రాజయోగం ఏర్పడటం వల్ల ధనుస్సు రాశి, మిథున రాశి, మకర రాశి వారి జీవితంలో పెను మార్పులు వస్తాయని కొందరు అంటున్నారు. నీచ భంగ రాజయోగము, శష రాజయోగం, హన్స్ రాజయోగం, గజకేసరి రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడతాయన్నది మరికొందరి నమ్మకం. ఐతే ఇది పంచగ్రహ కూటమి కాదని.. ఐదు గ్రహాలు ఒకే వరుసలోకి మాత్రమే వస్తున్నాయని.. ఇది ఖగోళ అద్భుతమే తప్ప.. జోతిష్యానికి, భవిష్యవాణికి ఎలాంటి సంబంధం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఐదు గ్రహాలు ఒకే కూటమిలోకి వచ్చినప్పుడు మాత్రమే పంచగ్రహ కూటమి అంటారు.. ఐతే ఇప్పుడు ఆ పరిస్తితి లేదని.. మూడు గ్రహాలు మీనంలో ఉంటే.. రెండు గ్రహాలు మేషంలో ఉన్నాయని.. దీనికి జోతిష్యానికి ఎలాంటి సంబంధం లేదని.. భూమి అంతం అయిపోయేంత ప్రమాదం ఏదీ లేదని పలువురు పండితులు సూచిస్తున్నారు. ఎవరైనా ఎలాగైనా చూడొచ్చని.. ప్రత్యేకంగా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.