WOMEN RTC FREE: మహిళలకు ఉచిత ప్రయాణం.. వారం రోజుల దాకా ఐడీ కార్డ్ అక్కర్లేదు !
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలో భాగంగా మొదటి హామీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. డిసెంబర్ 9 నాడు సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కూడా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు.

WOMEN RTC FREE: డిసెంబర్ 9 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ స్కీమ్ అమల్లోకి వస్తోంది. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులతో సీఎం సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పథకాన్ని మహిళా మంత్రులతో కలసి ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలో భాగంగా మొదటి హామీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. డిసెంబర్ 9 నాడు సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
REVANTH REDDY: రేవంత్ దర్బార్.. సీఎం ప్లాన్ మామూలుగా లేదుగా..!
మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కూడా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో అన్ని వయస్సుల బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ ఉచితంగా ప్రయాణించవచ్చు. రాబోయే వారం రోజుల వరకూ ఎలాంటి ఐడీ కార్డులు చూపించనక్కర్లేకుండా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ పథకం కేవలం తెలంగాణలోని మహిళలకు మాత్రమే ఉద్దేశించినది. ఇతర రాష్ట్రాల మహిళలకు అనుమతి లేదు. అందువల్ల వారం తర్వాత.. తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఐడీ కార్డులు లేదా ఆధార్ చూపించాల్సి ఉంటుంది. తెలంగాణ సరిహద్దుల దాకా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. ఆ తర్వాత మాత్రం టిక్కెట్లు కొనుక్కోవాలి. ఈ పథకం కోసం 7 వేల 200 బస్సులను వినియోగిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు.
ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 45శాతం వరకూ ప్రయాణిస్తున్నారు.. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే.. 55 శాతం వరకూ ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ స్కీమ్‌తో ఆర్టీసీపై రోజుకు 3 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. త్వరలో కొత్త బస్సులు కూడా కొనుగోలు చేస్తున్నామనీ.. ప్రయాణికులకు జర్నీలో ఎలాంటి ఇబ్బంది కలగకపోవచ్చని అంటున్నారు సజ్జనార్.