Madras High Court: పోర్న్ వీడియోలు చూస్తే తప్పు కాదు .. అసలు తప్పంతా అలా చేస్తేనే.. హైకోర్ట్ సంచలనం

అశ్లీల వీడియోలకు సంబంధించి ఓ వ్యవహారం మద్రాస్‌ కోర్టు వరకు వెళ్లింది. దీనిపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 13, 2024 | 02:30 PMLast Updated on: Jan 13, 2024 | 6:44 PM

Gen Z Grappling With Porn Addiction Must Be Counselled Out Of It Says Madras High Court

Madras High Court: ఇంటర్నెట్‌తో లాభమే కాదు.. నష్టం కూడా చాలానే ఉంది. ప్రతీసారి జరుగుతున్న చర్చ ఇదే. అశ్లీల వీడియోల విషయంలో ప్రతీసారి వినిపించే మాటలు ఇవే. ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో.. అశ్లీల వీడియోలు పిల్లలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయని.. దీంతో వారు మానసికంగానే కాదు.. అన్ని రకాలుగా చెడిపోతున్నారన్నది చాలామంది నుంచి వినిపించే వాదన. ఐతే ఇలాంటి అశ్లీల వీడియోలకు సంబంధించి ఓ వ్యవహారం మద్రాస్‌ కోర్టు వరకు వెళ్లింది.

Janasena Target : జనసేన టార్గెట్ టెన్ వీళ్లే ! ఓడించి తీరాలని కసితో ఉన్నారు !!

దీనిపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. సెల్‌ఫోన్‌లో బూతు చిత్రాలు చూసినందుకు.. ఓ యువకుడిపై కేసు నమోదు కాగా.. కోర్టు ఆ కేసు కొట్టేసింది. అశ్లీల చిత్రాలను ఫోన్‌లో డౌ‌న్‌లోడ్ చేసుకుని వ్యక్తిగతంగా చూడడంలో ఎలాంటి తప్పు లేదని.. వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. 1990లో యువత.. మద్యం, ధూమపానానికి ఎలా అలవాటయ్యారో.. 2కే కిడ్స్ కూడా అలాగే అశ్లీల చిత్రాలకు బానిసలుగా మారారని అన్నారు. వారిపై అనవసరంగా నిందలు మోపడం మాని.. ఆ అలవాటు నుంచి వారు బయటపడేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేంత పరిణతి సమాజానికి రావాలని అభిప్రాయపడ్డారు.

ఆ యువకుడిపై అనవసరమైన నిందలు ఆపి.. ఆ బూతు ఊబి నుంచి అతన్ని బయటపడేయాలని.. అధికారులకు సూచించారు. ముుఖ్యంగా స్కూల్ స్థాయిలోనే.. వారికి ఇలాంటి వాటిపై అవగాహన కప్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది.