Germany: భారత్ విషయంలో బలిసి కొట్టుకుంటున్న జర్మనీ.. చైనా ముందు మనల్ని తక్కువ చేస్తూ చెత్త గీతలు..
జనాభాలో ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది భారత్. చైనా సెకండ్ ప్లేస్‌కు పడపోయింది. జనాభా పెరగడంతో నష్టాల కంటే లాభాలే ఎక్కువ. పెరిగిన జనాభాలో యువకుల శాతమే ఎక్కువ. ఏ దేశానికి లేని యువశక్తి భారత్ సొంతం. అంటే వర్క్ ఫోర్స్ ఎక్కువ మనకి ! కోట్లకు కోట్లు ఖర్చు చేసినా.. ఏ దేశం కొనలేని బలం ఇది. అలాంటిది ఇదే జనాభాను కారణం చూపిస్తూ.. జర్మనీలో వంకర రాతలు రాసిందో పత్రిక.
మ్యాగజైన్ డెర్ స్పీగెల్ ప్రచురించిన కార్టూన్.. జాత్యహంకార దాడిగా కనిపిస్తోంది. కార్టూన్‌లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని కిక్కిరిసిపోయి పైభాగంలో కూర్చున్న వ్యక్తులతో రద్దీగా ఉండే భారతీయ రైలు ఒకవైపు.. దీనికి సమాంతరంగా కేవలం ఇద్దరు డ్రైవర్లతో నడుస్తున్న చైనా బుల్లెట్ రైలు మరోవైపు.. ఇండియన్ రైలును బుల్లెట్ ట్రైన్ అధిగమించినట్లు బొమ్మలు.. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అవుతోంది. ఇంత బలుపా.. చేతికి ఇంత దూలా అని సోషల్ మీడియాలో మనోళ్లు ఫైర్ అవుతున్నారు.
భారత్, చైనా మధ్య అభివృద్ధి స్థాయిల పోలికను వివరించేలా సెటైరికల్‌గా ఈ కార్టూన్ గీశారు. దీన్ని చూస్తుంటే.. ఘోరమైన జాత్యహంకారం కనిపిస్తోంది. పండుగ సీజన్లలో మనదేశంలో రద్దీగా ఉండే రైళ్లను సూచిస్తూ… మన పేదరికాన్ని ఎగతాళి చేసేలా కనిపిస్తోంది. ఇది మీడియా కవరేజీలో హైలైట్ చేయబడి అభివృద్ధిలో వెనుకబాటుతనాన్ని టార్గెట్ చేసుకునేలా ఉంది. జర్మనీ కార్టూన్‌గా గీయడంపై అందరు దుమ్మెత్తి పోస్తున్నారు. రాజకీయ నేతలు కూడా దీనిపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
ఇప్పటివరకు ఒకెత్తు ఇకపై ఒకెత్తు.. వెటకారం చేసిన నోళ్లే.. నోరు తెరుచుకునే రోజులు వస్తాయని.. ఆ కళ్లు క్షమాపణతో నిండిపోతాయని.. బీజేపీ నేతలు అంటున్నారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరబోతోందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉన్నా.. ఇలాంటి బలుపు రాతలు, గీతలు కరెక్ట్ కాదు.. ఇంత వెక్కిరింపు అసలే తగదు. రాసినోడికి.. రాయించినోడికి.. రాతలను చూసి మురిసేటోడికి.. సిగ్గుండాలి కాస్తైనా అని ఫైర్ అవుతున్నారు జనాలు.