Germany Women: స్త్రీపై వివక్ష చూపిన స్విమ్మింగ్ పూల్ – హక్కులను పోరాడి సాధించుకున్న మహిళ

స్విమ్మింగ్ ఫూల్స్ లో సాధారణంగా వేసవితాపాన్ని తీర్చుకునేందుకు, వ్యాయామం కోసం, ఆనందంగా గడపడం కోసం వెళ్తూ ఉంటాం. గతంలో ఇక్కడ ఈత కొట్టేందుకు వెళ్లినప్పుడు ఒక మహిళను బయటకు నెట్టేశారు. దీనికి కారణం పురుషులతో సమానంగా టాప్ లెస్ స్విమ్ డ్రస్ ధరించినందుకు. దీంతో ఆమె పోరాటం చేశారు. మహిళలకి కూడా పురుషులతో సమానంగా వస్త్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సుదీర్ఘ పోరాటం తరువాత జర్మనీ రాజధాని అయిన బెర్లిన్ ప్రభుత్వం స్విమ్మిగ్ ఫూల్ డ్రస్సుల్లో సమానత్వం కల్పించాలని తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2023 | 06:29 PMLast Updated on: Mar 11, 2023 | 6:33 PM

Germany Women Fight Againes Men

ఈత అనేది శరీరానికి చాలా మంచి వ్యాయామం. ఎందుకంటే మనలోని అన్ని అవయవాలు కదలికలు జరిగి మంచి హుషారును అందిస్తుంది. అలాంటి ఈత కోసం చిన్న పిల్లలు పెద్ద పెద్ద బావులను, చెరువులను వెతుక్కుంటూ ఉంటారు. నగరాల్లో అయితే స్విమ్మింగ్ ఫూల్స్ వచ్చేశాయి. పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా లోతు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. గంటకు ఇంత అని రుసుమును వసూలు చేస్తారు.

ఇటీవలె కాలంలో ఒక మహిళ జర్మనీలోని ఒక స్విమ్మింగ్ ఫూల్ కి వెళ్లి ఈత కొట్టాలని అనుకుంది. అక్కడ మహిళలకు ఉన్న స్విమ్ డ్రస్ నిబంధన తెలియక ఓపెన్ ఎయిర్ పూల్ లో టాప్ లెస్ గా సన్ బాత్ చేసింది. దీనికి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా ఆమెను బయటకు వెళ్లాలని ఆదేశించారు. అక్కడి పరిస్థిని జీర్ణించుకోలేని మహిళ లీగల్ గా పోరాటం చేసింది. ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా వస్త్రాలు వేసుకొని ఈత కొట్టే హక్కు కూడా లేదా అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనికి కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చాయి. పురుషులకు మల్లే సమానంగా తమకు కూడా టాప్ లెస్ డ్రస్ వేసుకునేందుకు అనుమతిని మంజూరు చేయాలని సెనెట్ అంబుడ్స్ పర్సన్ అధికారులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదుపై పరిశోధన జరిపిన అధికారులు ఇలా స్త్రీలు ఇబ్బంది పడుతున్నది వాస్తవమే అని గ్రహించారు. ఓపెన్ స్విమ్మింగ్ పూల్స్ వద్ద పురుషులకు సమానంగా ఈత కొట్టేందుకు, అందులోనికి వెళ్లేందుకు, చూసేందుకు స్వేచ్ఛను ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె ఈత పోరాటం గెలిచింది. స్త్రీపై భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విధంగా సమస్యలు తలెత్తుతూనే ఉంటుంది. మహిళపై ప్రతి దేశంలో ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉంది అనడానికి ఈ ఒక్క సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. అక్కడ మహిళ పోరాటం చేసింది కాబట్టి సమస్య సర్థుమనిగింది. మన భారత్ లో కూడా ఇలా స్పూర్తిని తీసుకున్నప్పుడే సరైన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.

 

T.V.SRIKAR