Italy Ghost Iland: ప్రపంచంలో అత్యంత భయంకరమైన ద్వీపం.. ఒక్కసారి వెళితే తిరిగి రారు..?
ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలున్నాయి. కొన్ని ప్రదేశాలు అక్కడి ప్రకృతి అందాలను నుంచి మన చూపు తిప్పుకోకుండా చేసే.. మరో కొన్ని ప్రదేశాల్లో అక్కడికి మన చూపు తిప్పాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాయి. అలాంటి ఓ ప్రదేశం ఇప్పుడు మీరు చూడబోయే.. చదవబోయేది.

Ghost Island in Italy is there The government has permanently closed off tourists from visiting.
ఈ భూమి మీద అత్యంత ప్రకృతి అందాలు ఉన్న దేశాల్లో ఇటలీ కి ఓ ప్రత్యేక స్థానమే ఇవ్వాలి. ఎందుకంటే అక్కడి ప్రకృతి అందాలు అలా ఉంటాయి మరీ. అక్కడి సరసులు గానీ, నదులు గానీ, పర్వతాలు గాని, ప్రాచీన కట్టడాలు గానీ, ప్రఖ్యతి గాంచిన వృక్ష్యలు ఇలా చెప్పుకుంటూ పోతే వగైర వగైర ఉన్నాయి. ఇటలీ కి కొద్ది దూరంలో సముద్రం చూడడానికి అందంగా ఓ చిన్నపాటి దీవిని మాత్రం ఇటలీ మూసివేసింది, వేలివేసింది అని కూడా చెప్పవచ్చు.
ఆ ప్రదేశం ఏంటో తెలుసుకుందాం
ఇటలీ తన అందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల నాటి నగరం, సంస్కృతి, దృశ్యాలను చూస్తే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి ఆకర్షితులవుతున్నారు. ఈ దేశంలో మరొక భయానకా కోణం కూడా ఉంది. దాని పేరు పోవెగ్లియా ద్వీపం. ఇటలీ ఘోస్ట్ ఐలాండ్
వైఫై ఆకారంలోని దీవి..
దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు. ఈ ద్వీపాన్ని ఆకాశం లో నుంచి చూస్తే వైఫై సింబల్ మాదిరిగా ఉంటుంది. 56 ఏళ్లుగా ఈ ప్రదేశం పూర్తిగా ఇటలీ ప్రభుత్వం మూసీవేసింది. 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ఇటలీ దూరంగా ఉంచుతూ వస్తుంది. ఇక్కడికి పర్యాటకులను ఇటలీ ప్రభుత్వం ఎట్టి పరిస్థులల్లో అనుమతించరు. ఎందుకు ఈ ద్వీపం ను చూసి ఇంతాల భయపడుతున్నారు అని మీకు ఓ ప్రశ్న తలెత్తుతుంది కాదు.. అయితే కాత్త ఈ ద్వీపం చరిత్రలోకి వెళ్లిలి మారీ..

Ghost Island in Italy is there The government has permanently closed off tourists from visiting.
వలసలు పెరిగి ప్రాంతం..
14వ శతాబ్దంలో జనం అక్కడి నగరాల్లో బాగానే ఉండేవారు. మనిషి ఆవాసాలకు అనుగుణంగా, ఆ దీవిని వదిలి విశాల మైన మైదనా ప్రాంతాల్లోకి వలస వేళ్లారు. అలా ఒకరి తరువాత ఒకరుగా ఐలాండ్ నుంచి బయటకు వలసలు పోవడం మొదలుపెట్టారు. అందరూ పోవడంతో అక్కడ ఉన్న మరికొంత మంది ఒంటరితనం భయంతో తప్పని పరిస్థితిలో దీవిని ఖాళీ చేసి సమీప ప్రాంతాలకు తరలిపోయారు.
వేల మరణాలు.. పాతిపెట్టిన మృతదేహం
అదే సమయంలో అనగా 14వ శతాబ్దంలో ఇటలీలోని ప్లేగు మహమ్మారి వ్యాపించింది.
వ్యాధిగ్రస్తులను నగరంలో ఉంచక.. ఆ ఖాళీ గా ఉన్న ద్వీపంలో ఉంచి వైద్యం అందించారు. వ్యాధి కన్నా ముందు ఆ మహమ్మారి వ్యాప్తి చెందకుండా.. ఆ దీవిలో ఉంచారు. ఆ వ్యాధితో సుమారు 1 లక్షా 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ తర్వాత మృతదేహాలన్నింటినీ కాల్చివేసి పాతిపెట్టారు. అనంతరం ఆ ప్రదేశంలో 1930లో ఇటలీ మానసిక ఆసుపత్రి నడిపింది. అప్పుడు ఓ వినూత్న ఘటన జరిగింది. ఒక రోజు ఆస్పత్రి డైరెక్టర్ ఎత్తైన టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అందరు భయందోళనకు గురైయ్యారు.
ప్రాణాలతో తిరిగి రాకపోవడానికి కారణం ఇదే..
నిజానికి అక్కడికి వెళ్లిన వారెవరూ వ్యాధి కారణంగా తిరిగి రాలేకపోయారు. అప్పటి నుండి ఈ ప్రదేశం శాపగ్రస్తమైనదిగా పరిగణించబడుతుంది. వరుస ఇలాంటి ఘటనలు జరగడంతో 1968 నుండి పూర్తిగా ఈ ద్వీపంను మూసివేశారు. గత 56 ఏళ్లుగా ఇక్కడికి ఎవరూ వెళ్లలేదు. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు. అర్థాయువుతో మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికుల విశ్వాసం. నిజానికి ఈ దీవికి వెల్లిన అక్కడ ఉన్నవారు ఎవరూ కూడా తిరిగి బయటకు ప్రాణాలతో రాలేదు అన్న మాట వాస్తవమే. దాంతో అది చావులకు నిలయంగా మారిపోయి గోస్ట్ సిటీగా మారిపోయింది. మత్స్యకారులు పై ఈ ద్వీపం దరిదాపుల్లోకి కూడా పోరు.
2015లో మళ్లీ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. ఇక్కడ విలాసవంతమైన రిసార్ట్‌ను నిర్మించాలనే చర్చ కూడా తెరపైకి వచ్చినప్పటికీ, ఆ విషయం కార్యరూపం దాల్చ లేదు. ఎవరు ముందుకు వచ్చి, అంత ధైర్యం చూపలేదు.