Gold Price: భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం..!? కారణాలివే..!

బంగారం ఈ మధ్య కాలంలో చుక్కలనంటింది. అయితే అది ఎక్కవ కాలం కొనసాగలేక పోయింది. పెరుగుట తరుగుట కొరకే అనే సామెతను నిజం చేస్తూ దిగువకు పడిపోయింది. ఒకప్పటి బంగారం ధరతో పోలిస్తే ప్రస్తుతం గ్రాముకు రూ. 400 నుంచి 10గ్రాములకు దాదాపు రూ.4000 వరకూ తగ్గింది. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. దీనికి కారణం అంతర్జాతీయంగా డాలర్ విలువ దోబూచులాడటమే అని చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2023 | 07:23 PMLast Updated on: Mar 09, 2023 | 7:24 PM

Gold Price In International Market

బంగారాన్ని కొనేందుకు ఇప్పుడు చాలా మంది మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి మూహూర్తాలు, శుభకార్యలు ఎక్కువగా ఉండటంతో పసిడి కొనుగోలు ఎక్కవగా విక్రయం జరుగుతుంది. ధరను బట్టీ బంగారాన్ని కొనుగోలు చేసే రోజులు ఎప్పుడో పోయాయి. అవసరం బట్టీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగే పరిస్థితి నెల రోజులు తరువాత ఉండకపోవచ్చు. దీనికి కారణం ఏప్రిల్ నెలలో ముహూర్తాలు ముగియడంతో అందరూ అంతగా ఆసక్తి చూపరన్నది విక్రేతల అభిప్రాయం.

డాలర్ పై ఆధారపడిన బంగారం ధర:

ఇదిలా ఉంటే బంగారం ధరను నిర్ణయించేది అంతర్జాతీయ మార్కెట్ లోని డాలర్ విలువ. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. అదే డాలర్ విలువ తగ్గితే బంగారం విలువ పెరుగుతుంది. దీనికి కారణం అమెరికన్స్ బంగారాన్ని మనలాగా లిక్విడ్ రూపంలో కొనుగోలు చేయరు. కేవలం బాండ్ల రూపంలో, షేర్ల రూపంలోనో కొంటూ ఉంటారు. అలా కొనుగోలు చేసిన పసిడిని ఫూచర్ కాంట్రాక్టులు తీసుకుంటారు. అప్పుడు వారికి అమెరికన్స్ ఎక్కవ ధరకు విక్రయిస్తారు. అలా ఆ సంస్థలు అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల మనపై ఆభారం పడుతుంది. కాబట్టీ బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడు వారి డాలర్ విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా కొనేందుకు సుముఖత చూపించరు. అదే ఒకవేళ బంగారం ధర తక్కువగా ఉందనుకోండి కొనడానికి ఎక్కువ డాలర్లు వెచ్చించవలసి వస్తుంది. దీనికారణంగా మనకు తగ్గుతూ ఎక్కుతూ ఉంటాయి. దీనిని బట్టీ మనకు అర్థం అయిందేమిటంటే మనకు తక్కువ ధరకు పసిడి అమ్మాలంటే అమెరికా డాలర్ విలువ పెరగాలి.

GOLD

GOLD

తగ్గుదలకు కారణం ఇదే:

సాధారణంగా ప్రపంచంలో లిక్విడ్ రూపంలో బంగారాన్ని ఎక్కవగా ఎవరూ కొనుగోలు చేయరు. ఒక్క చైనా, భారత్ తప్ప అందరూ ఆన్లైన్ లోనే కొనేందుకు ఇష్టపడతారు. క్రిందటి సంవత్సరం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2052 డాలర్లు ఉండేది. కానీ ఇప్పుడు అదే ఔన్సు ధర 1815 డాలర్లకు పడిపోయింది. ఔన్సు అంటే 31.10 గ్రాములు అనమాట. బంగారం ఇలా ఉండగా డాలర్ అప్పట్లో రూ.76 గా ఉండేది. కానీ ప్రస్తుతం రూ. 82 వద్ద స్థిరపడింది. మన్నటి వరకూ బంగారం చుక్కలనంటడానికి కారణం ఔన్సు బంగారం ధర 1952 డాలర్లు పలికింది. అందుకే దేశీయ మార్కెట్లో 24క్యారెట్ స్వర్ణం 10గ్రాములు రూ.60,900కు ఎగబాకింది. ఫిబ్రవరి తరువాత ఇప్పుడు చూసినట్లయితే ఔన్సు ధరపై 137 డాలర్లు తగ్గింది. అందుకే మన దేశీయ మార్కెట్లో 10గ్రాములపై స్వచ్చమైన బంగారానికి రూ.4000 తగ్గింది. ఇప్పుడు రూ. 56900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే వెండి కూడా అంతే. గతంలో కిలో వెండి రూ. 72,000 ఉంటే రూ.63,500 గా పడిపోయింది. అంటే ప్రస్తుతం రూ. 8500 తగ్గిందనమాట.

మోసాలు జరిగే ప్రమాదం – జాగ్రత్త:

రానున్న రోజుల్లో మరింత దిగువకు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు. దీనికి కారణం ఇందాక చూసిన అంతర్జాతీయ ఔన్సు ధర, డాలర్ విలువ. ఇది మరో 45-55 డాలర్ల మధ్య తగ్గే అవకాశం ఉన్నట్లు బులియన్ అసోసియేషన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా మన స్థానికి మార్కెట్లో 10గ్రాములు స్వచ్చమైన మేలిమి బంగారం రూ.53 – 55 వేల రూపాయలకు చేరవచ్చని భావిస్తున్నారు. అదే కిలో వెండి ధర రూ.60 వేల వరకూ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తక్కువ ధరల పేరుతో మోసపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణం సరైన బిల్లులు, సర్టిఫికేట్ లేకుండా అమ్మాకాలు జరగడం వల్ల ఎగబడి కొనేస్తారు. అది మంచి బంగారమే కాదా అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోరు. తమకు తెలసినవారే అని ప్యూరిటీ చూడుకుండా బేరమాడి మరీ కొనుగోలు చేస్తారు. దీనికి ప్రదాన కారణం తక్కువ ధరకే ఎక్కువ బంగారం వస్తుందన్న భ్రమలో ఉండిపోవడం. ఇలా కొన్నతరువాత భవిష్యత్తులో అమ్మేందుకు పోతే స్వచ్చమైన బంగారం కాదని బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే బిల్లు, ధృవీకరణ పత్రంతోనే కొనుగోలు చేయడం ఉత్తమం.

 

T.V.SRIKAR