Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ట్రైన్ లైవ్ లొకేషన్.. లేటెస్ట్ ఫీచర్లివే..!

ఇకపై రైలు లైవ్ లొకేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే వాహనదారులకు ఇంధన ఖర్చులను ఆదా చేసే ఫీచర్లను కూడా అందిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 03:37 PMLast Updated on: Dec 21, 2023 | 3:37 PM

Google Maps Introduces Address Descriptors Live Walking Navigation In India

Google Maps: వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్లు యాడ్ చేయబోతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్లతో, యూజర్ల లైఫ్‌స్టైల్‌కి అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే యూజర్లందరికీ ఈ ఫీచర్లు అందుబాటులో రానున్నాయి.

New Corona Virus : చలి పెరుగుతోంది.. జాగ్రత్త..! కొత్త కరోనా వైరస్ లక్షణాలేంటి..?

కొత్త అప్‌డేట్స్ ప్రకారం.. ఇకపై రైలు లైవ్ లొకేషన్ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే వాహనదారులకు ఇంధన ఖర్చులను ఆదా చేసే ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ ఫీచర్లను ఇప్పటికే యూరప్, అమెరికా, యూకేలో విజయవంతంగా అందిస్తోంది. త్వరలో ఇండియాలోనూ ఈ సేవలను అందించనుంది. ఎవరికైనా చిరునామా ఇవ్వాలంటే ఏదో ఒక చిన్న ల్యాండ్ మార్క్ వాడతాం. ఇకపై ఇదంతా ఈ ఫీచర్ మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో గూగుల్ మ్యాప్స్ చేస్తుంది. మ్యాప్‌లో కావాల్సిన అడ్రస్‌కు దగ్గరలోని ల్యాండ్ మార్కులు, ఏరియా పేర్లను గూగుల్‌లో చూపుతుంది.

Sanitary Napkin: ప్రభుత్వ కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్స్.. హైకోర్టు ఆదేశం

దీని ద్వారా అడ్రస్ ఎక్కడ ఉందో యూజర్లు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇదంతా ఏఐ టెక్నాలజీ సాయంతో పని చేస్తుంది. దీంతో ఎవరైనా సులభంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ ఫీచర్ వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే వెహికల్‌లో ఫ్యూయల్ ఆదా చేసే ఫీచర్ కూడా తీసుకొచ్చింది. కారు ఇంజిన్‌ను బట్టి నిర్దిష్ట మార్గంలో ఎంత ఇంధన సామర్థ్యం లభిస్తుందో తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్లు, రూట్ సమాచారాన్ని అందిస్తుంది. దీంతో పాటు రైళ్ల లైవ్ లొకేషన్ తెలుసుకునేందుకు కూడా ఫీచర్ తీసుకురానుంది. గూగుల్ మ్యాప్స్‌లో వేర్ ఈజ్ మై ట్రైన్ ఫీచర్ వస్తోంది.

ఈ కొత్త ఫీచర్ 2024 నుంచి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా కోల్‌కత్తా నుంచి ముంబై లోకల్ వరకు ట్రైన్ వరకు లైవ్ లొకేషన్‌ తెలుసుకోవచ్చు. దీంతో మీరు నడక ప్రారంభించినప్పుడు, ఫోన్ డిస్‌ప్లేపై మీకు ఒక సింబల్ కనిపిస్తుంది. అది ఏ దిశలో వెళ్లాలో మీకు చూపిస్తుంది. మీరు దాన్ని రోటెట్ చేసినప్పుడు ఫోన్ వైబ్రేట్ అవుతుంది.