ANTI COLD DRUG: నాలుగేళ్ళలోపు పిల్లలకు.. ఆ జలుబు మందు వాడొద్దు !
దగ్గు, జలుబులకు సంబంధించి యాంటీ కోల్డ్ డ్రగ్ కాంబినేషన్ తయారు చేసే కంపెనీలు తప్పనిసరిగా తమ ఉత్పత్తులపై ఫిక్స్‌డ్ డ్రగ్ కాంబినేషన్ వార్నింగ్‌ని మెన్షన్ చేయాలి.
ANTI COLD DRUG: నాలుగేళ్లలోపు చిన్నారులకు యాంటీ కోల్డ్ డ్రగ్ కాంబినేషన్ జలుబు, దగ్గు మందును వాడకుండా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాంటీ కోల్డ్ డ్రగ్ వాడొద్దని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. నాలుగేళ్ళలోపు పిల్లలు వాడకూడదంటూ.. ఈ కాఫ్ సిరప్ బాటిల్స్ లేబులింగ్ వేయాలని కూడా ఆదేశించింది.
Singareni Elections: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు అంగీకారం..
దగ్గు, జలుబులకు సంబంధించి యాంటీ కోల్డ్ డ్రగ్ కాంబినేషన్ తయారు చేసే కంపెనీలు తప్పనిసరిగా తమ ఉత్పత్తులపై ఫిక్స్‌డ్ డ్రగ్ కాంబినేషన్ వార్నింగ్‌ని మెన్షన్ చేయాలి. నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందు వాడరాదని, ఆ మందు బాటిల్స్‌పై తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఈ కాంబినేషన్ జలుబు మందుల్లో.. క్లోరో ఫెనిరామైన్ మలైట్‌తో పాటు.. ఫెనిలే ఫిరైన్ అనే డ్రగ్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ డ్రగ్ ఉపయోగించడం వల్ల.. జలుబుతో పాటు సైనస్ ఇబ్బందులు ఉంటే నయం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. విపరీతమైన జలుబుతో ముక్కు కారడం లాంటివి ఈ డ్రగ్ కంట్రోల్ చేస్తుంది.
Sanitary Napkin: ప్రభుత్వ కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్స్.. హైకోర్టు ఆదేశం
ఈ కాంబినేషన్ డ్రగ్‌ను మోతాదుకు మించి వాడితే మరణాలు కూడా సంభవిస్తాయని వెబ్ ఎండీ వెబ్‌సైట్ వెల్లడించింది. అంతేకాదు శరీరంపై దద్దుర్లు, కళ్ళు మసకబారడం, శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తలెత్తే అవకాశముంది. ఈ కాంబినేషన్ దగ్గు, జలుబు మందు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 141 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంటీ కోల్డ్ డ్రగ్ కాంబినేషన్‌ని బ్యాన్ చేసింది భారత్. 2019 నుంచి భారత్‌లో ఈ దగ్గు, జలుబు మందుతో చాలా మంది చిన్నారులు చనిపోయారు. గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్‌లోనూ ఈ మరణాలు జరిగాయి. దాంతో భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మందులపై నిఘా పెరిగింది.
భారత్‌లో తక్కువ రేటుకే దగ్గు, జలుబు మందులు దొరుకుతుండటంతో చాలా దేశాలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి దగ్గు, జలుబు మందుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. వాటిని తప్పనిసరిగా టెస్ట్ చేయాలని రూల్ విధించింది. కంపెనీలు తమ మందులు బెస్ట్ అని చెప్పుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందస్తు జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఎలాంటి అప్రూవల్‌లేని యాంటీ కోల్డ్ డ్రగ్ ఫార్ములేషన్స్‌ని కొన్ని సంస్థలు భారీగా ప్రమోట్ చేసుకుంటూ మార్కెట్లో అమ్ముతున్నాయి. ఈ మందు వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే 4యేళ్ళ లోపు పిల్లలకు పొరపాటున కూడా ఈ మందును ఇవ్వొద్దని చెబుతోంది కేంద్రం.