COVID 19: మళ్లీ కరోనా కలకలం.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?
ఈసారి JN1 వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. కొత్త వేరియంట్‌తో యూపీ, కేరళల్లో ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. కేరళలో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
COVID 19: ముగిసిపోయిందనుకున్న మహమ్మారి మళ్లీ పడగ విప్పబోతుందా..? ఈసారి పరిస్థితి మరింత భయంకరంగా ఉండబోతుందా..? కరోనా మళ్లీ విలయం సృష్టించబోతుందా..? ఇవే భయాలు కనిపిస్తున్నాయ్ ఇప్పుడు జనాల్లో. కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈసారి JN1 వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. కొత్త వేరియంట్‌తో యూపీ, కేరళల్లో ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.
AYODHYA RAM TEMPLE: అయోధ్య రాముడికి భక్తుడి కానుక.. రాములోరి మెడలో 5 వేల వజ్రాల హారం..
కేరళలో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. కరోనా కొత్త వేరియంట్‌తో తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తం అయింది. JN 1 లక్షణాలతో ఉన్న ఐదుగురు రోగులను గుర్తించినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, కడుపు ఉబ్బరం లక్షణాలు ఉన్నాయ్. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయ్. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా చలి కాలంలో శ్వాసకోస ఇబ్బందులు వస్తాయ్.
ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్‌లోని పిరోలా వేరియెంట్‌కి JN 1 ఉపరకం. ఈ వేరియెంట్ ఫస్ట్ కేసు అమెరికాలో సెప్టెంబర్‌లో వెలుగు చూసింది. ఇప్పటివరకు 11దేశాల్లో ఈ కేసులు బయటపడ్డాయ్. ఐతే ఒమిక్రాన్ అంత వేగంగా JN 1 వ్యాప్తి చెందట్లేదని డాక్టర్లు గుర్తించారు. ఐతే వ్యాప్తి మాత్రం ఉంటుందని.. చలికాలం సీజన్ కావడంతో వైరస్ స్ర్పెడ్‌ను కంట్రోల్ చేయడం కష్టతరంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్నారు.
Pushpa 2 Jagadeesh: కథ అడ్డం తిరిగింది.. జగదీష్ అరెస్ట్ వెనుక అసలు కథ..
JN 1 వేరియంట్.. కరోనా నుంచి కోలుకున్నవాళ్లకు, అలాగే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కూడా సోకుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ వేరియెంట్ వ్యాక్సిన్‌లకు లొంగే రకమని అంటున్నారు. JN 1 వైరస్ ప్రమాదకరం అని చెప్పడానికి ఎలాంటి కారణాలు లేవని.. పైగా ఆసుపత్రుల్లో చేరాల్సినంత అవసరమూ రాకపోవచ్చని డాక్టర్లు అంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.