TTD: టీటీడీకి ఒక్క రోజే రూ.ఐదు కోట్ల ఆదాయం.. భారీగా పెరిగిన భక్తుల రాక..
టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఒక్కరోజే 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.5.05 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. అదేరోజు 26,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
TTD: వరుస సెలవులు రావడంతో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. గత శని, ఆది, సోమవారాల్లో భారీ స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి కూడా కావడంతో తిరుమల భక్త సంద్రంగా మారింది. దీంతో చాలారోజుల తర్వాత తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది.
SALAAR: హార్ట్ టచింగ్‌గా సలార్ సాంగ్.. ప్రభాస్ ఎమోషనల్
టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఒక్కరోజే 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.5.05 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. అదేరోజు 26,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు శనివారం నాడు 67,909 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా.. జనవరి 1వ తేదీ వరకూ ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. దీంతో… ఉత్తర ద్వార దర్శనం నుంచి తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో నేడు స్వామి వారి గరుడ సేవను రద్దు చేశారు. పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన గరుడ సేవను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవం నిర్వహిస్తున్నందున పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది. కాగా.. తిరుమల శ్రీవారికి కొద్ది రోజులుగా ఒక్కరోజు ఆదాయం రూ.5 కోట్లు దాటలేదు. ఆదివారమే మళ్లీ ఆ స్థాయి ఆదాయం సమకూరింది. మొత్తంగా అంటే… వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమల హుండీ ఆదాయం 7.55 కోట్లు వచ్చింది. తిరుమలలోని కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. తదుపరి సర్వదర్శనం టోకెన్లు జనవరి 2 నుంచి ఇవ్వనున్నారు.