అంతరిక్షంలో కుక్క ఎలా చనిపోయింది.. ట్రైనింగ్ ఎలా ఇచ్చారు…?

అంతరిక్ష పరిశోధన చరిత్రలో లైకా అనే కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. మాస్కోకు చెందిన లైకా అనే కుక్క భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన మొదటి జీవిగా చరిత్ర సృష్టించింది. ఇది అంతరిక్ష ప్రయాణంలో కీలక మైలురాయిగా చెప్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2025 | 05:35 PMLast Updated on: Mar 23, 2025 | 5:35 PM

How Did The Dog Die In Space How Was It Trained

అంతరిక్ష పరిశోధన చరిత్రలో లైకా అనే కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. మాస్కోకు చెందిన లైకా అనే కుక్క భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన మొదటి జీవిగా చరిత్ర సృష్టించింది. ఇది అంతరిక్ష ప్రయాణంలో కీలక మైలురాయిగా చెప్తారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనల కారణంగా, మానవులు అంతరిక్ష ప్రయాణాలు చేయడం సాధ్యం కాలేదు. తత్ఫలితంగా, సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు… అంతరిక్ష ప్రయోగాలకు జంతువులను ఎంచుకున్నారు.

అయితే, లైకా కథ కేవలం సంచలనమే కాకుండా ఆ కుక్క చేసిన ప్రాణ త్యాగానికి కూడా ప్రతీకగా చెప్తారు. సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న కాలంలో, అంతరిక్ష పోటీ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో లైకా అంతరిక్ష యాత్ర జరిగింది. మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1 విజయవంతంగా ప్రయోగించిన తరువాత, అక్టోబర్ విప్లవం సందర్భంగా.. 40వ వార్షికోత్సవంలో సోవియట్ యూనియన్ నాయకురాలు నికితా క్రుష్చెవ్.. అంతరిక్షంలో విజయం సాధించాలని పట్టుదలగా అడుగులు వేసారు.

అప్పటి అంతరిక్ష ప్రయాణం, అంతర్ గ్రహ పరిశోధనలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. లైకా ఎంపిక, దానికి శిక్షణ కూడా ఓ చరిత్ర. లైకా మాస్కో వీధులలో తిరిగే మూడేళ్ల వయసున్న కుక్క. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం వీధి కుక్కలనే ఎంపిక చేసారు. ఎందుకంటే అవి చాలా దృఢంగా ఉంటాయని.. ఎలాంటి పరిస్థితిలో అయినా జీవించేందుకు.. ప్రతిఘటనలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటాయనేది వారి నమ్మకం. దీనితో లైకాను అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేసారు.

ప్రత్యేక జెల్లీతో కూడిన ఆహారాన్ని.. తినడానికి, అంతరిక్ష నౌకలో ఉండే ఇరుకైన స్థలంలో పడుకోవడం, నిలబడటం.. గురుత్వాకర్షణ మార్పులను అర్ధం చేసుకోవడానికి కుక్కకు ట్రైనింగ్ ఇచ్చారు. లైకా అంతరిక్ష ప్రయాణం నవంబర్ 3, 1957న జరిగింది. స్పుత్నిక్ 2 లో లైకా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఒక జీవిని కక్ష్యలోకి పంపే సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం.. అంతరిక్షంలో.. శరీర మార్పులను అంచనా వేయడానికి ఈ మిషన్ చేపట్టారు. అయితే లైకా.. ప్రయాణం విషాదకరంగా ముగిసింది. అక్కడి పరిస్తితులను లైకా తట్టుకోలేకపోయింది.

లైకాను పంపడమే గాని తీసుకు రావడంపై రష్యా దృష్టి పెట్టలేదు. ప్రయోగ సమయంలో, భూమికి తిరిగి రావడానికి రక్షణ కల్పించే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో.. లైకాను తిరిగి తీసుకురావడానికి ఎటువంటి ప్రణాళికలు లేవు. లైకా రెండు రోజులు మాత్రమే అంతరిక్షంలో జీవించినట్టు రష్యా చెప్పింది. కాని పైకి వెళ్ళిన కొన్ని గంటల్లోనే లైకా చనిపోయిందని నాసా చెప్పుకొచ్చింది. అక్కడి వేడి వాతావరణం, భయం, కంగారుతో లైకా చనిపోయింది. అయితే ఇప్పటి వరకు వాస్తవాలు ఏంటీ అనేది రష్యా చెప్పలేదు. ఇక లైకా కంటే ముందే అమెరికా కోతులను, చింపాంజీలను అంతరిక్షంలోకి పంపింది. కాని లైకా ప్రయాణమే చరిత్రలో గొప్పదిగా నిలిచిపోయింది. అక్కడి నుంచే అంతరిక్ష ప్రయోగాలు వేగం పుంజుకున్నాయి.