NEW YEAR CELEBRATIONS: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. ఈ రూల్స్ పాటించాల్సిందే..
పోలీసులు విధించిన రూల్స్ ప్రకారం.. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలి. న్యూ ఇయర్ ఈవెంట్స్ ఆర్గనైజర్లు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి. ప్రతి ఈవెంట్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

NEW YEAR CELEBRATIONS: డిసెంబర్ 31న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా అంతటా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ముందు జాగ్రత్తగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పోలీసులు విధించిన రూల్స్ ప్రకారం.. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలి. న్యూ ఇయర్ ఈవెంట్స్ ఆర్గనైజర్లు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి. ప్రతి ఈవెంట్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
REVANTH REDDY: ఎంపీ అభ్యర్థుల ఎంపిక రేవంత్ చేతుల్లో.. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయేది వీళ్లే..
ఈవెంట్లలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. వేడుకల్లో మ్యూజిక్, ఇతర శబ్దాలు 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ప్రతి ఈవెంట్‌లో భద్రతాపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈవెంట్‌కు వచ్చే వారి కోసం పార్కింగ్ సమస్యలు లేకుండా చూడాలి. కెపాసిటికి మించి పాసులు ఇవ్వకూడదు. మద్యం అనుమతి ఉన్న ఈవెంట్లలో మైనర్లను అనుమతించకూడదు. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్యలు కల్పించొద్దు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు. నిర్ణీత సమయానికి మించి మద్యం సరఫరా చేయొద్దు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు పడితే పదివేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల వరకపు జైలు శిక్ష విధిస్తారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే.. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తారు.
మరోవైపు న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ నిల్వ ఉంచారనే సమాచారంతో ఇప్పటికే నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిన్నారు. పబ్బుల్లో స్నిఫర్ డాగ్స్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా పెట్టారు. పబ్బులు, సినీ ఇండస్ట్రీపై నార్కోటిక్ అధికారులు నిఘా పెట్టారు. డ్రగ్ డ్రాపర్ టెస్టులు చేసేందుకు అవసరమైన డ్రగ్ డ్రాపర్ మెషీన్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ మెషీన్లతో లాలాజలం శాంపిల్‌తో క్షణాల్లో డ్రగ్స్ వాడకంపై ఫలితాలు తెలుస్తాయి.