IAS IN TELANGANA: సచివాలయంలో అందమైన ఐఏఎస్‌.. తప్పనిసరిగా ఉండాల్సిందేనా..?

స్మితా సబర్వాల్‌, ఆమ్రపాలి మధ్య వృత్తిపరంగా.. ఉద్యోగపరంగా చాలా పోలికలు కనిపిస్తాయ్. ఇద్దరు చిన్న ఏజ్‌లోనే సివిల్స్ క్రాక్‌ చేశారు. స్మితా సబర్వాల్‌ 4వ ర్యాంక్ సాధిస్తే.. ఆమ్రపాలి 39వ ర్యాంక్‌ సాధించి.. ఐఏఎస్‌గా ఎంపిక అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2023 | 02:10 PMLast Updated on: Dec 12, 2023 | 2:10 PM

Ias Are Beautifull In Telangana Is Mandatory

IAS IN TELANGANA: ఇదే ఇప్పుడు జనాల్లో జరుగుతున్న చర్చ. తెలంగాణ సీఎం రేవంత్‌ను… ఐఏఎస్‌ ఆమ్రపాలి కలిసిన తర్వాత క్షణం నుంచి జనాల నుంచి వినిపిస్తున్న మాట ఒకటే.. సచివాలయంలో అందమైన ఐఏఎస్ ఉండాల్సిందేనా అని! బీఆర్ఎస్ సర్కార్ హయాంలో స్మితా సబర్వాల్‌.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమ్రపాలి. ఇద్దరిని కంపేర్‌ చేస్తూ.. ఇద్దరి అందంపై ప్రశంసలు గుప్పిస్తూ.. జనాలు మాట్లాడుకుంటున్న మాట కూడా ఇదే!

Smita Sabharwal: ఆమె ఔట్.. ఈమె ఇన్.. తెలంగాణకు అమ్రపాలి.. స్మిత ఔట్..?

స్మితా సబర్వాల్‌, ఆమ్రపాలి మధ్య వృత్తిపరంగా.. ఉద్యోగపరంగా చాలా పోలికలు కనిపిస్తాయ్. ఇద్దరు చిన్న ఏజ్‌లోనే సివిల్స్ క్రాక్‌ చేశారు. స్మితా సబర్వాల్‌ 4వ ర్యాంక్ సాధిస్తే.. ఆమ్రపాలి 39వ ర్యాంక్‌ సాధించి.. ఐఏఎస్‌గా ఎంపిక అయ్యారు. బాధ్యతల విషయంలోనూ ఇద్దరు చాలా స్ట్రిక్ట్ అనే పేరు ఉంది. ఇక అందంలోనూ.. ఇద్దరిని పోలుస్తుంటారు జనాలు. మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ కొందరు మీరు అందంగా ఉంటారు మేడమ్ అంటూ చాలామంది బహిరంగంగానే ప్రశంసలు గుప్పించారు. సోషల్‌ మీడియాలో అయితే ఈ ఇద్దరికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎలా ఉన్నా.. రేవంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. దాదాపు అందరు అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక్క స్మితా సబర్వాల్ తప్ప! కారణం ఏదైనా.. ఆమెకు బదిలీ తప్పదు అనే చర్చ జరుగుతోంది. ఐతే అటు ఢిల్లీలో డిప్యూటేషన్ పూర్తి చేసుకున్న ఆమ్రపాలి.. ఇప్పుడు రేవంత్‌ను కలిశారు.

ఆమెకు సీఎంవో సెక్రటరీగా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పదవి ఇదే అయినా.. కాకపోయినా.. రేవంత్‌ పేషీలో ఆమెకు కీలక పదవి దక్కడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. నిజానికి డిప్యూటేషన్‌ మీద ఢిల్లీకి వెళ్లడానికి ముందు.. ఆ టైమ్‌లో మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలి.. పెద్ద గొడవ జరిగింది. వరంగల్ వరదలపై రివ్యూ నిర్వహించిన కేటీఆర్‌.. అధికారుల మీద సీరియస్ అవగా.. ఆమ్రపాలి చేతులెత్తి దండం పెడుతూ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పెద్దలకు, ఆమ్రపాలికి మధ్య దూరం పెరిగింది. ఐతే ఆ తర్వాత కలెక్టరేట్ బంగ్లాలో దెయ్యం ఉందని ఆమ్రపాలి కామెంట్లు చేయడం.. ఆమె మీద బదిలీ వేటు పడడం జరిగిపోయాయ్.

ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమ్రపాలి… ఆ తర్వాత సెంట్రల్ డిప్యుటేషన్‌కు వెళ్లారు. ఇప్పుడు అది పూర్తి చేసుకొని.. మళ్లీ తెలంగాణకు రాబోతున్నారు. స్మితా సబర్వాల్‌ ఎలాగూ సచివాలయంలో కనిపించరు అని దాదాపు కన్ఫార్మ్ అయింది. స్మితా వెళ్లి.. ఆమ్రపాలి రాబోతున్నారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. సచివాలయంలో అందమైన ఐఏఎస్‌ ఉండాల్సిందేనా అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.