Fairness Creams danger : ఫెయిర్ నెస్ క్రీములు వాడితే కిడ్నీలు మటాష్ !

ఈమధ్య కాలంలో చాలా మంది అందంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చర్మ సౌందర్యం కోసం ఫెయిర్నెస్ క్రీమ్ తెగ వాడుతున్నారు. టీవీల్లో కనిపించే యాడ్స్ చూసి ఎట్రాక్ట్ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 11:13 AMLast Updated on: Apr 15, 2024 | 11:13 AM

If Fairness Creams Are Used The Kidneys Are Matash

 

 

 

ఈమధ్య కాలంలో చాలా మంది అందంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చర్మ సౌందర్యం కోసం ఫెయిర్నెస్ క్రీమ్ తెగ వాడుతున్నారు. టీవీల్లో కనిపించే యాడ్స్ చూసి ఎట్రాక్ట్ అవుతున్నారు. కొత్తగా ఏ క్రీమ్ మార్కెట్లోకి వచ్చినా…వాటిని ట్రై చేస్తున్నారు. ఈ ఫెయిర్ నెస్ క్రీములతో చాలా డేంజర్… రాబోయే రోజుల్లో కిడ్నీలు పాడవుతాయని ఓ సర్వేలో వెల్లడైంది.

ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడకం వల్ల భారత్ లో కిడ్నీ బాధితులు పెరుగుతున్నట్టు లేటెస్ట్ గా ఓ స్టడీలో తేలింది. ఈ క్రీమ్స్ లో ఉండే పాదరసం మూత్రపిండాలకు హాని చేస్తున్నట్టు గుర్తించారు. చర్మం అందంగా ఉండాలి… మంచి నిగారింపు కావాలి అనుకునే వాళ్ళంతా ఫెయిర్ నెస్ క్రీములు తెగ పూసేస్తున్నారు. దాంతో భారతీయ మార్కెట్ లో వీటికి మస్తు గిరాకీ పెరిగింది. ప్రతి యేటా ఈ మార్కెట్ పెరిగిపోతోంది. ఇలాంటి ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయన్న స్టడీతో ఆందోళన మొదలైంది. లేటెస్ట్ స్టడీ వివరాలను కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. అధిక పాదరసం ఉన్న క్రీమ్స్ వాడితే మెంబ్రానస్ నెఫ్రోపతి (MN) కేసులు పెరుగుతున్నాయట. ఇవి కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తాయి. ప్రొటీన్ లీకేజీకి కూడా కారణమవుతాయని స్టడీస్ చెబుతున్నాయి.

MN అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీని వల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. అంటే మూత్రంలో ఎక్కువ ప్రొటీన్ బయటకు పోతుంది. 2021 జూలై నుంచి 2023 సెప్టెంబరు మధ్య కాలంలో 22 MN కేసులు నమోదయ్యాయి. వీటిని స్టడీ చేస్తే… చర్మం ద్వారా పాదరసం శరీరంలోకి వెళ్లి మూత్రపిండాల ఫిల్టర్లను ప్రభావితం చేస్తుందని తేలింది. అందుకే నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుతున్నట్టు పరిశోధకుల్లో ఒకరైన ఆస్టర్ MIMS హాస్పిటల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ డాక్టర్ సజీష్ శివదాస్ ‘X’ లో తెలిపారు. మన దేశంలో ఇలాంటి దుష్ప్రభావాలను కలిగించే ఫెయిర్ నెస్ క్రీమ్స్ ఎక్కువగా మార్కెట్లో దొరుకుతున్నట్టు ఆయన చెబుతున్నారు. సో ఇప్పటికైనా ఇలాంటి క్రీమ్స్ జోలికి వెళ్ళకుండా… మన అమ్ముమ్మలు, తాతమ్మల కాలం నాటి ఆయుర్వేదం… నేచురల్ ఐటెమ్స్ అప్లయ్ చేసుకుంటే బెటర్ అంటున్నారు.