కష్టాలన్నీ మీకే ఉన్నాయి అనుకుంటే ఈ వీడియో చూడండి… మీ ఆలోచన మారిపోతుంది
ప్రపంచంలో చాలా మంది.. ఈ భూమి మీద ఉన్న కష్టాలన్నీ వాళ్లకే ఉన్నాయి అనుకుంటారు. వాళ్లకంటే పక్కవాళ్ల జీవితాలు చాలా హ్యాపీగా ఉన్నాయనే భ్రమలో బ్రతుకుతుంటారు.

ప్రపంచంలో చాలా మంది.. ఈ భూమి మీద ఉన్న కష్టాలన్నీ వాళ్లకే ఉన్నాయి అనుకుంటారు. వాళ్లకంటే పక్కవాళ్ల జీవితాలు చాలా హ్యాపీగా ఉన్నాయనే భ్రమలో బ్రతుకుతుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే.. కష్టాలు ప్రతీ ఒక్కడి జీవితంలో కామన్. కాకపోతే.. ఒకడి కష్టం మరొకడికి సింపుల్.. ఎవడి కష్టం వాడికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది అంతే. నిజంగా మీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి.
వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి కళ్లు లేవు. కళ్లు లేవుకదా అని ఆకలి తగ్గుతుందా.. తగ్గదు కదా కదా. దైవం ముందు అంతా ఎలా సమానమో.. ఆకలి ముందు కూడా అందరూ అంతే సమానం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ అబ్బాయి ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలు పెద్దగా తెలియకపోయినా,. ఈ వీడియో చూడని వాళ్లు మాత్రం దాదాపుగా ఉండరు. ఆ రేంజ్‌లో వైరల్ అవుతోంది ఈ వీడియో. కళ్లు లేకపోయినా కుటుంబ పోషణ కోసం ఆ అబ్బాయి కష్టపడుతున్న తీరు ప్రతీ ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. దీంతో పాటు అతనికి సాయంగా పని చేస్తున్న మరో యువకుడు కూడా ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిస్తున్నాడు.
ఆస్తిపాస్తులను బట్టి మనుషులతో బంధాలు పెంచుకునే, తెంచుకునే రోజులు ఇవి. అలాంటిది కళ్లు లేకపోయినా పనిలో తన స్నేహితుడికి అండగా నిలిచాడు. తానే తన మిత్రుడికి కంటి చూపై ముందుకు నడిపించాడు. ఇక్కడ ఆ వ్యక్తి చేసింది కేవలం సాయం మాత్రమే కాదు.. ఓ కుటుంబం కడుపు నింపాడు. నార్మల్‌గా చాలా మంది తాము చేసే పనుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే చాలు చేసే పనులు ఆపేస్తారు. ఆ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి పని చేయలేకపోయామంటూ సాకులు చెప్తారు. కానీ ఈ యువకుడు మాత్రం.. విధి తనను వంచిచినా.. విధిని ఎదిరించి మరీ నిలబడ్డాడు. దేవుడు తనను చిన్న చూపు చూసినా.. చూపు ఉన్న ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
నువ్వు ఎందుకు పని చేయడంలేదు అని ఆ వ్యక్తిని అడిగేవాళ్లు లేరు. ఎందుకంటే ఆ అబ్బాయికి రెండు కళ్లు లేవు. కానీ దాన్ని అతను తనకు అడ్డంకి అనుకోలేదు. అంగవైకళ్యాన్ని ఎదిరించి నిలబడ్డాడు. అందుకే ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. కామన్ పీపులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. కళ్లు లేకపోయినా ఆ మనిషి కుటుంబం కోసం కష్టపడుతున్న తీరు.. అంత కష్టంలో కూడా చెయ్యి వదలకుండా తన స్నేహితుడు తోడు నిలిచిన తీరుకు ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు.