Telangana, Diwali : తెలంగాణలోని ఈ ప్రాంతంలో దీపావళి స్మశానంలో జరుపుకుంటారు.

సాధారణంగా దీపవాళి అంటే ఎలా చేసుకుంటాం. ఇల్లంతా శుభ్రం చేసి గ్రాండ్‌గా డెకరేట్‌ చేసుకుంటాం. సాయంత్రం ఇంటి బయట ప్రమిదలు ఎట్టి వెలుగు విరాజిల్లేలా అలంకరిస్తాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 12, 2023 | 02:50 PMLast Updated on: Nov 12, 2023 | 2:50 PM

In This Region Of Telangana Diwali Is Celebrated In The Graveyard

సాధారణంగా దీపవాళి అంటే ఎలా చేసుకుంటాం. ఇల్లంతా శుభ్రం చేసి గ్రాండ్‌గా డెకరేట్‌ చేసుకుంటాం. సాయంత్రం ఇంటి బయట ప్రమిదలు ఎట్టి వెలుగు విరాజిల్లేలా అలంకరిస్తాం. ఇక చిన్నా పెద్దా అంతా ఇంటి ముందు బాంబులు పేల్చుతూ ఎంతో ఎంజాయ్‌ చేస్తాం. కానీ ఈ ఊర్లో మాత్రం దీపావళి జరుపుకునే స్టైల్‌ చాలా డిఫరెంట్‌. ఆ ఏరియా మొత్తం దీపావళి వచ్చిందంటే స్మశానానికి వెళ్లిపోతారు. అక్కడే సమాధులను అలంకరించి, పిండి వంటలు చేసుకుని, బాంబులు పేల్చుతూ సెలబ్రేట్‌ చేసుకుంటారు. దాదాపు 60 ఏళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఇదేదో వేరే రాష్ట్రంలోనో మారుమూలు ప్రాంతంలోనో జరిగే విషయం కాదు.

PM MODI: చైనా సరిహద్దులో మోదీ.. సైనికులతో దీపావళి..!

మన తెలంగాణలో.. అది కూడా కరీనంనగర్‌ జిల్లాలోని ఓ ఏరియాలో జరిగే తంతు. ఇక్కడి కర్కానగడ్డ ఏరియా ప్రజలు ప్రతీ ఏడాది దీపావళి పండుగను స్మశానంలోనే జరుపుకుంటారు. దీపావళి రోజున ఇళ్లలో ఎవరూ ఉండరు. స్మశానంలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద దీపాలు పెట్టి పూలతో అలంకరిస్తారు. ఇంట్లో పిండి వంటలు చేసుకుని వచ్చి పూర్వీకుల సమాధుల వద్ద ఉంచుతారు. ఇక స్మశానంలోనే బాంబులు పేలుస్తూ పండగ చేసుకుంటారు. ఇలా చేస్తే తన పూర్వీకులు తాము పండుగ చేసుకున్నట్లు భావిస్తున్నామని చెబుతున్నారు ఇక్కడి ప్రజలు. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు.. దాదాపు 60 ఏళ్ల నుంచి ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని చెప్తున్నారు. తమ ముందు తరం కూడా దీపావళి పండుగను ఇలాగే జరుపుకునే వాళ్ళు చెప్తున్నారు. అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు.