INDIA TRAVEL: ఈ టూరిస్టు ప్లేసులకు వెళ్లే దమ్ముందా..? ఇండియాలో డేంజరస్ టూరిస్ట్ ప్లేసెస్

కొందరికి థ్రిల్ కావాలి. ప్రమాదకరమైన ప్రదేశాల్ని, సాహసోపేతంగా సందర్శించడం అంటే ఇష‌్టం. అలాంటి వాళ్ల కోసం కూడా కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. కాకపోతే, అవి చాలా ప్రాణాంతకం. ఎంతో రిస్క్ తీసుకుని ప్రయాణించాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 07:01 PMLast Updated on: Feb 22, 2024 | 7:01 PM

India Travel Dangerous Tourist Places In India

INDIA TRAVEL: కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఎక్కువగా సుందరమైన, సేఫ్ ప్లేసెస్‌నే ఎంచుకుంటారు. అయితే, అందరికీ అలాంటి ఆలోచనలే ఉండవు. కొందరికి థ్రిల్ కావాలి. ప్రమాదకరమైన ప్రదేశాల్ని, సాహసోపేతంగా సందర్శించడం అంటే ఇష‌్టం. అలాంటి వాళ్ల కోసం కూడా కొన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. కాకపోతే, అవి చాలా ప్రాణాంతకం. ఎంతో రిస్క్ తీసుకుని ప్రయాణించాలి. ఒకవేళ అలాంటి ప్లేసెస్ చూడాలనుకుంటే వాళ్లకోసమే ఈ వివరాలు.
మున్సియారి (ఖలియా టాప్)
ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన హిల్ స్టేషన్ ఇది. సాధారణ ప్రదేశాలకు దూరంగా, విసిరేసినట్లుంటుంది. మున్సియారిని ఖలియా టాప్ అని కూడా అంటారు. ఖలియా టాప్ పితోర్‌ఘర్‌లోని మున్సియరిలో, సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. పూర్తిగా మంచుతో కప్పి ఉండే ఈ ప్రాంతం చాలా ప్రమాదకరం. ఐదేళ్లలో ఇక్కడ నలుగురు పర్యాటకులు మరణించారు. మంచుతో ఉండటం, టెంపరేచర్, ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడికి వచ్చే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇంత ప్రమాదకరం అని తెలిసినా కొందరు ఇక్కడి వెళ్తూనే ఉంటారు. వాళ్లకు మాత్రం ఆ ప్రదేశం మాటలకు అందని అనుభూతిని మిగులుస్తుంది అంటారు.
నైనిటాల్‌ టిఫిన్ టాప్
నైనిటాల్‌లోని టిఫిన్ టాప్ ఎత్తైన పర్వత ప్రాంతం. సముద్ర మట్టానికి 2,290 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పర్యాటకులు ఇక్కడికి టిఫిన్, లంచ్ తీసుకుని వచ్చి తినడం వల్ల ఈ పర్వతానికి నైనిటాల్ టిఫిన్ టాప్ అనే పేరొచ్చిందని తెలుస్తోంది. నైనిటాల్ సిటీ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. చుట్టూ కుమావోన్ పర్వతాలుంటాయి. ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే.. 360 డిగ్రీల కోణంలో నైనిటాల్ సిటీ, చుట్టూ అందాల్ని చూడొచ్చు. నడకమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రదేశానికి ఎక్కడం వల్ల ఆయాసం, ఇతర సమస్యల కారణంగా చాలా మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోతుంటారు. బయటి నుంచి వచ్చే పర్యాటకులు నైనిటాల్‌లో ఒకరోజు ఆగిన తర్వాతే ఎక్కి ప్రారంభించాలి.
రూప్‌కుండ్
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది రూప్‌కుండ్. ఇది సముద్ర మట్టానికి 5200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇదొక హిమానదీ సరస్సు. ఇది చాలా మిస్టీరియస్ ప్రదేశం. ఇక్కడ అనేక పురుష అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఈ సరస్సులో చాలా మంది పురుషుల అస్థిపంజరాలున్నాయి. వీటిని చూసేందుకు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నిజానికి ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టమైన పని. పర్యాటకులు తమ వెంట గైడ్‌ను తీసుకెళ్లాలి. లేకపోతే శ్వాస ఆడకపోవడం, ఇతర సమస్యల వల్ల ఇబ్బందులు పడి ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉంటే ఈ ప్రయాణం చేయకూడదు.
కేదార్‌నాథ్ ప్రధాన్ ధామ్
కేదార్‌నాథ్ ప్రధాన ధామ్.. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌లలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాధారణంగా మైదాన ప్రాంతం నుంచి వచ్చే పర్యాటకులు నేరుగా కేదార్ నాథ్ ఎక్కుతారు.. అయితే ఇది చాలా ప్రమాదకరం. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఒకరోజు ఆ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. దీని తర్వాత మాత్రమే వారు కేదార్ నాథ్ వెళ్లాలి.