INDIA TRAVEL: ఇక్కడ క్లిక్కుతో కిక్కే.. ఫొటోల కోసం బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్..!

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నం. ఇండియాను సందర్శించాలనుకునే విదేశీయుల మొదటి డ్రీమ్.. తాజ్ మహల్ సందర్శించడం. అక్కడ ఫొటో తీసుకోవడం. భారతీయులు కూడా తాజ్ మహల్ ఎదురుగా ఫొటో తీసుకోవడాన్ని ప్రెస్టీజియస్‌గా భావిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 08:28 PMLast Updated on: Feb 22, 2024 | 8:34 PM

India Travel Super Captivating Places For Photography In India

INDIA TRAVEL: ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ ఫొటోలు తీసుకోవడం కామన్. అయితే, కొన్ని ప్రదేశాల్లో ఫొటోలు తీసుకోవడం మాత్రం సంథింగ్ స్పెషల్. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ లొకేషణ్లలో ఫొటో తీసుకుంటే.. ఆ కిక్కే వేరు. అలాంటి ఫొటోలకు అనువైన కొన్ని ప్రదేశాలివి.
తాజ్ మహల్..
ప్రపంచంలో ఈ పేరు తెలియని టూరిస్ట్ ఉండరు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నం. ఇండియాను సందర్శించాలనుకునే విదేశీయుల మొదటి డ్రీమ్.. తాజ్ మహల్ సందర్శించడం. అక్కడ ఫొటో తీసుకోవడం. భారతీయులు కూడా తాజ్ మహల్ ఎదురుగా ఫొటో తీసుకోవడాన్ని ప్రెస్టీజియస్‌గా భావిస్తారు. పాలరాతితో నిర్మించిన ఈ చారిత్రక ప్రదేశం ఫొటోలు తీసుకోవడానికి ఎంతో అనువైనది.
గేట్ వే ఆఫ్ ఇండియా
ముంబైలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గేట్ వే ఆఫ్ ఇండియా. ముంబై వెళ్లిన వాళ్లు కచ్చితంగా గేట్ వే ఆఫ్ ఇండియాను చూడాలనుకుంటారు. దక్షిణ ముంబైలోని అపోలో బందర్ ప్రాంతంలో, తాజ్ హోటల్‌కు దగ్గర్లో అరేబియా సముద్రం అంచున ఉంటుంది. ఈ చారిత్రక, అరుదైన, అందమైన కట్టడం ఎదుట ఫొటోలు తీసుకోవడాన్ని అందరూ ఆస్వాదిస్తారు. మంచి టూరిస్ట్ స్పాట్‌గా పేరు తెచ్చుకున్న గేట్ వే ఆఫ్ ఇండియా.. మనదేశంలో అత్యధికంగా ఫొటోలు తీసుకునే ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది.
విక్టోరియా మెమోరియల్
బ్రిటీషర్ల కాలంలో, కోల్‌కతాలో నిర్మించిన విక్టోరియా మెమోరియల్‌కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఇది అరుదైన, అద్భుతమైన ప్యాలెస్. ఈ చారిత్రక కట్టడాన్ని బ్రిటీష్ క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం కోల్‌కతాలో నిర్మించారు. ఆమె మన దేశాన్ని సుమారు 25 సంవత్సరాలు పాలించింది. ఆమె గుర్తుగా నిర్మించిన ఈ భవనం ఆ నాటి నిర్మాణ శైలికి ప్రతీక. చుట్టూ అందమైన ఉద్యానవనంలో, సువిశాలమైన ప్రాంగణంలో ఉండే ఈ భారీ ప్యాలెస్ ఇప్పుడో టూరిస్ట్ స్పాట్‌గా మారింది. కోల్‌కతా వచ్చే పర్యాటకులు తప్పకుండా ఇక్కడికొచ్చి ఫొటోలు తీయించుకుంటారు.
గోల్డెన్ టెంపుల్
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సిక్కులు మాత్రమే కాకుండా.. ఇతరులు కూడా ఈ గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకుంటారు. ఇటు స్వర్ణ దేవాలయం, అటు సరోవర్ నది.. ఎంతో అందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశంలో ఫొటోలు తీసుకోవడానికి సందర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.