Love Proposal: ఎయిర్‌పోర్ట్ అనౌన్స్‌మెంట్‌తో ప్రియురాలికి ప్రపోజ్.. ఇంటర్నెట్ ఫిదా..!
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన యశ్రాజ్ చబ్రా బ్యాకింగ్ స్పెషలిస్ట్. కొంత కాలంగా ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్న రియా శుక్లా అనే అమ్మాయిని యశ్‌రాజ్ ప్రేమిస్తున్నాడు.
Love Proposal: మనం ప్రేమించే మనుషులకు ప్రేమను కొత్తగా తెలపడం చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇలా ప్రేమను పొందడం కూడా చాలా అదృష్టం. అందుకేనేమో తన ప్రియురాలికి మర్చిపోలేని గిఫ్ట్‌లా తన ప్రేమను వినూత్నంగా చెప్పాలి అనుకున్నాడు ఓ వ్యక్తి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన యశ్రాజ్ చబ్రా బ్యాకింగ్ స్పెషలిస్ట్.
కొంత కాలంగా ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్న రియా శుక్లా అనే అమ్మాయిని యశ్‌రాజ్ ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ తమ ఆఫీస్ పని మీద ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లారు. తిరిగి న్యూజిలాండ్‌కు చేరుకోగానే ప్రియురాలికి పెళ్లి ప్రపోజ్ చేయాలి అనుకున్నాడు యశ్‌రాజ్. తన ప్రేయసికి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చేందుకు ఏకంగా ఎయిర్‌పోర్ట్ అనౌన్స్‌మెంట్‌లో తన ప్రపోజల్ వినిపించాడు. ఆ అనౌన్స్‌మెంట్ విన్న రియా ఒక్కసారిగా షాకయ్యింది. యశ్‌రాజ్ వైపు చూసేటప్పటికే అతను రింగ్ పట్టుకుని మోకాళ్లపై రియా ముందు కూర్చుని ఉన్నాడు.
ఈ సీన్ మొత్తం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రయాణికులను కట్టిపడేసింది. వాళ్లిద్దరి లవ్‌స్టోరీకి అక్కడివాళ్లంతా ఫిదా అయ్యారు. ఈ వీడియోను ఆక్లాండ్ ఎయిర్‌పోర్ట్ తన సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వాట్ ఏ క్యూట్ ప్రపోజల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.