Mukesh Kumar: వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఫాస్ట్ బౌలర్.. స్నేహితురాలితో ముకేష్ పెళ్లి..!

గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2023 | 06:42 PMLast Updated on: Nov 29, 2023 | 6:42 PM

Indian Pacer Mukesh Kumar Gets Married To Divya In Dreamy Ceremony

Mukesh Kumar: టీమిండియా యంగ్‌ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు దివ్యా సింగ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్‌ 28న ముఖేష్‌-దివ్య వివాహం అట్టహాసంగా జరిగింది. గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Virat Kohli: బీసీసీఐకి షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. ఆ మ్యాచులకు దూరం..

డిసెంబర్ 4న గోరఖ్‌పూర్‌లో ముఖేష్-దివ్యల వివాహ రిసెప్షన్ జరగనుంది. నిజానికి, భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ముఖేష్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ ఆ తర్వాత భారత జట్టు నుంచి సెలవు తీసుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ముఖేష్‌ అందుబాటులో లేడని తెలిపిన కెప్టెన్‌ సూర్య కుమార్ యాదవ్.. ముఖేష్‌ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడని, అందుకే జట్టు నుంచి తప్పుకున్నాడని తెలిపాడు. కాగా మూడో టీ20 మ్యాచ్‌కు అందుబాటులో లేని ముఖేష్ కుమార్ రాయ్‌పూర్‌లో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు శుక్రవారం జట్టులో చేరనున్నాడని బీసీసీఐ వెల్లడించింది. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముకేశ్ కుమార్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ముకేశ్ వివాహ ఫోటోలను షేర్ చేస్తూ, ఢిల్లీ జట్టు తమ శుభాకాంక్షలు తెలిపింది. ముకేశ్ కుమార్ కాట్ అండ్ బౌల్డ్ బై దివ్యా అంటూ.. వెల్ కమ్ టూ డీసి ఫ్యామిలీ అని విషెస్ అందించింది. ముకేశ్ కుమార్ టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసాడు. బంతుల్ని వేగంగా విసరడంతో పాటు, టెక్నిక్ ఉన్న బౌలర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ముకేష్ తన ఆటతో ఎందో అభిమానుల్ని సంపాదించుకున్నాడు.