Mayushi Bhagath: అమెరికాలో భారతీయ విద్యార్థిని గల్లంతు.. ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు

29 ఏళ్ల మయూషి నాలుగేళ్ల క్రితం నుంచి కనిపించడం లేదు. అంటే.. 2019 మే 1న న్యూజెర్సీలో కనిపించకుండాపోయింది. మయూషి చివరిసారిగా స్థానికులకు ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఏప్రిల్‌ 29, 2019న కనిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 03:21 PMLast Updated on: Dec 22, 2023 | 3:21 PM

Indian Student Mayushi Bhagath Missing In Us Fbi Announced 10000 Dollars

Mayushi Bhagath: అమెరికాలో ఒక భారతీయ విద్యార్థిని నాలుగేళ్లుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఆచూకీ కోసం అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెతుకుతోంది. మయూషి భగత్‌ అనే భారతీయ విద్యార్థిని స్టూడెంట్‌ వీసా మీద అమెరికాకు వెళ్లింది. మయూషి.. న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో చదువుకునేది. ఈ క్రమంలో 29 ఏళ్ల మయూషి నాలుగేళ్ల క్రితం నుంచి కనిపించడం లేదు. అంటే.. 2019 మే 1న న్యూజెర్సీలో కనిపించకుండాపోయింది.

AKKINENI NAGARJUNA: 300 మందితో నాగార్జున.. కాలర్ ఎగరేస్తున్న అభిమానులు

మయూషి చివరిసారిగా స్థానికులకు ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఏప్రిల్‌ 29, 2019న కనిపించింది. ఆరోజు పైజామా ప్యాంట్‌ నల్ల టీషర్టు ధరించి ఉంది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. ఎలాంటి సమాచారం లేదు. దీంతో మయూషి కుటుంబ సభ్యులు ఆమె మే 1 నుంచి కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మయూషి కోసం ఎంతగానో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో గతేడాది పోలీసులు ఆమెను మిస్సింగ్‌ వ్యక్తుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె ఆచూకీపై విచారణ ఇంకా కొనసాగుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఈ కేసుపై విచారణ సాగిస్తోంది. మయూషి భగత్‌ ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఎఫ్‌బీఐ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూషి మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలదు.

మయూషికి న్యూజెర్సీలోని సౌత్‌ ప్లెయిన్‌ఫీల్డ్‌‌లో స్నేహితులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మయూషి వివరాలను కూడా అధికారులు బయటకు వెల్లడించారు. ఆమె కళ్లు గోధుమ రంగులో ఉంటాయని, జుట్టు నల్లగా ఉంటుందని, ఎత్తు 5.10 అడుగులు ఉంటుందని తెలిపారు. దీంతో ఎఫ్‌బీఐ తన వెబ్‌సైట్‌‌లో మోస్ట్‌ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో మయూషి పేరును కూడా చేర్చింది. మయూషి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిపిన వారికి 10 వేల డాలర్ల బహుమతి.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.8.32 లక్షల రివార్డు ఇస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు.