Cosmetics: అందం కోసం 5 వేల కోట్లు.. కాస్మెటిక్స్ తెగ వాడేస్తున్నారుగా..!
ఇండియన్స్ ఆరు నెలల్లో కాస్మెటిక్స్ కోసం 5వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కాంతార్ వరల్డ్ ప్యానెల్ స్టడీ తేల్చింది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా కాస్మెటిక్స్ కొంటున్నారట. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ కాస్మెటిక్స్ తెగ కొనేస్తున్నారట.
Cosmetics: అతివకు అందమే ఆభరణం. అందుకే అమ్మాయిలు అద్దం ముందు తెగ గడిపేస్తారు. అందం కోసం వారు పడే తపన మల్టీ నేషనల్ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. మన దేశంలో ఈ తొలి ఆరునెలల్లోనే కాస్మెటిక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే బాబోయ్ అనిపిస్తుంది. ఇంతకీ ఎంత ఖర్చు చేశారో తెలుసా..!
కాస్మెటిక్స్ కోసం గత ఆరునెలల్లో భారతీయులు ఖర్చు పెట్టింది ఏకంగా 5 వేల కోట్ల రూపాయలు. అవును మీరు విన్నది నిజమే. ఇండియన్స్ ఆరు నెలల్లో కాస్మెటిక్స్ కోసం 5వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కాంతార్ వరల్డ్ ప్యానెల్ స్టడీ తేల్చింది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా కాస్మెటిక్స్ కొంటున్నారట. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ కాస్మెటిక్స్ తెగ కొనేస్తున్నారట. ఇక ఆరునెలల్లో అమ్ముడైన కాస్మెటిక్స్ ఎన్నో తెలుసా.. లిప్ స్టిక్స్ నుంచి ఐలైనర్ వరకు ఏకంగా 10కోట్ల వస్తువులు అమ్ముడయ్యాయట. దేశంలో అమ్ముడవుతున్న కాస్మెటిక్స్‌లో దాదాపు 40శాతం ఆన్‌లైన్‌లోనే అమ్ముడవుతున్నాయి. ఇక భారతీయ కాస్మెటిక్స్ వినియోగదారులు సగటున 1,214 రూపాయలు ఖర్చు చేశారట. అలాగే అమ్ముడైన 5వేల కోట్ల రూపాయల కాస్మెటిక్స్‌లో 38శాతం లిప్ ప్రొడక్ట్సేనట. ఆ తర్వాతి వాటా గోళ్ల సౌందర్యానికి సంబంధించినవే.
కాంతార్ స్టడీ మరో ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మన దేశంలో వర్కింగ్ ఉమెన్ గతంలో కంటే సౌందర్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని, ఫలితంగా కాస్మెటిక్స్ మార్కెట్ పెరుగుతోందని తేల్చింది. కాస్మెటిక్స్ వాడే సాధారణ మహిళలతో పోల్చితే ఉద్యోగినులు 1.6 శాతం ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్‌పై ఖర్చు చేస్తున్నారు. గత త్రైమాసికంలో 1,50,000 మేకోవర్లు చేశామని షాపర్స్ స్టాప్ ప్రకటించడం చూస్తుంటే బ్యూటీపై శ్రద్ధ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. యువ వినియోగదారులను సోషల్ మీడియాతో పాటు రిటైలర్లు కూడా ఎక్కువ ప్రభావితం చేస్తున్నారని కూడా ఈ సర్వే గుర్తించింది. వయసు పైబడుతున్న వారు ఎక్కువగా లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ వంటి ఉత్పత్తులు కొంటుంటే యువ వినియోగదారులు మాత్రం ఖరీదైన, టింటెడ్ లిప్ బామ్ వంటి ఉత్పత్తులను ప్రిఫర్ చేస్తున్నారట.
కాటుక, కుంకుమ, లిప్‌స్టిక్ వంటి ఉత్పత్తుల నుంచి భారతీయులు ఖరీదైన, ప్రీమియం ఉత్పత్తులవైపు మళ్లుతున్నారని స్టడీ తేల్చింది. ఐషాడోస్, కన్సీర్స్ వంటి ఉత్పత్తుల వినియోగం పెరిగింది. మహిళా ఉద్యోగినుల సంఖ్య పెరగడం కూడా కాస్మెటిక్స్ సేల్స్‌ను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగబోతోందంటున్నారు. మొత్తానికి అతివల అందం.. కాస్మెటిక్స్ కంపెనీలకు కనక వర్షం కురిపిస్తోంది.