Viral Video: 30 వేల అడుగుల ఎత్తులో రాఖీ.. వైరల్ అవుతున్న వీడియో..
అనుకోకుండా కలిసి రాఖీ వేడుక చేసుకోవొచ్చు. నార్మల్‌గా జరపుకునే పండుగకంటే అనుకోకుండా కలసి చేసుకునే వేడుక మరింత సంతోషాన్నిస్తుంది. అలాంటి సంఘటనే ఇండిగో విమానంలో జరిగింది.

Viral Video: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ వేడుకను దేశవ్యాప్తంగాక అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు చాలా గ్రాండ్‌గా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అన్నా చెల్లెళ్లు ఒకరినొకరు కలవడం వీలు కాకపోవొచ్చు. వృత్తి రీత్యా కొన్నిసార్లు కుదరకపోవొచ్చు.
కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కలిసి రాఖీ వేడుక చేసుకోవొచ్చు. నార్మల్‌గా జరపుకునే పండుగకంటే అనుకోకుండా కలసి చేసుకునే వేడుక మరింత సంతోషాన్నిస్తుంది. అలాంటి సంఘటనే ఇండిగో విమానంలో జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ అయిన శుభకు ఆ అదృష్టం కలిసివచ్చింది. శుభ సోదరుడు కెప్టెన్ గౌరవ్. ఇద్దరి జాబ్స్ కారణంగా రాఖీ రోజు వీళ్లిద్దరూ కలవలేకపోయారు. కానీ అనుకోకుండా ఇద్దరూ డ్యూటీలో ఒకే ఫ్లైట్‌లో ఉన్నారు. ఒకరు పైలట్ అయితే మరోకరు క్యాబిన్ క్రూ.
ఇంకేముంది.. అన్నని చూసిన శుభ ఆనందానికి అవధులు లేవు. వెంటనే తన సంతోషాన్ని ఇంటర్‌ఫోన్ ద్వారా ఫ్లైట్‌లో ఉన్నవాళ్లందరితో పంచుకుంది శుభ. తనకు అన్న అంటే ఎంత ఇష్టమో చెప్తూ ఎమోషనల్ అయ్యింది. వీళ్లిదరి స్వీట్ మూమెంట్స్‌ను ఫ్లైట్‌లో ఉన్న ప్యాసింజర్స్ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇండిగో కూడా తన అఫిషియల్ ట్విటర్ హ్యాండిల్‌లో కూడా ఈ వీడియోను షేర్ చేసింది.