Influenza: పెరుగుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసులు.. కరోనాకు మించి ప్రభావం ఖాయమా ?
పెరుగుతున్న కేసులతో.. కరోనా రిటర్న్స్ అనిపిస్తోంది పరిస్థితి. జలుబులు, జ్వరాలు చూసి.. కరోనాకు మించి ప్రభావం ఉంటుందా అనే భయాలు వ్యక్తం అవుతున్ాయ్. కరోనా సహ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న H3N2 ఇన్‌ఫ్లూయెంజా కేసుల ధోరణి పెరగడంపై ఆరోగ్య అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
మీరు అబ్జర్వ్ చేశారో లేదో.. హైదరాబాద్‌లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. విడువని జలుబు.. ఆగని దగ్గు.. అంతుబట్టని సమస్య జనాలకు వణుకు పుట్టిస్తోంది. నెలరోజులుగా దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిలో జలుబు, తడి, పొడి దగ్గు, గొంతు, ఒంటి, తలనొప్పులతో పాటు జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా బయట పడుతున్నాయ్. సాధారణ రోజుల్లో ఇవి మూడునాలుగు రోజులు.. గరిష్ఠంగా వారంలో తగ్గుతాయ్. ఐతే ఇప్పుడు కనీసం రెండు వారాల పాటు ఈ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయ్.
ఇన్‌ఫ్లూయెంజా, కరోనా పరీక్షలు చేసినా నివేదికలన్నీ నార్మల్‌గానే వస్తున్నాయ్. ప్రతి 10మందిలో కనీసం ఐదారుగురిని ఇలాంటి లక్షణాలు వెంటాడుతున్నాయ్. ఇందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మార్చి ప్రారంభమైన తర్వాత ఎండలు మొదలై.. మూడో వారానికి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయ్. ఈసారి మాత్రం ఫిబ్రవరి రెండోవారం నుంచే ఎండలు మొదలయ్యాయ్. దీంతో పొద్దంతా ఎండ, రాత్రుళ్లు చలి వంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయ్. దీంతో ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు బయటపడుతున్నాయ్. జలుబు కన్నా దగ్గు దీర్ఘకాలం పాటు ఉండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో గాలి కాలుష్యం పెరిగిన కారణంగా విడువని జలుబు, దగ్గు సమస్యలు వస్తున్నాయని కొందరి అభిప్రాయం.
రోగనిరోధక శక్తి తగ్గడమే కారణమని మరికొందరు అంటున్నారు. ఇన్‌ప్లూయెంజా వైరస్‌పై కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏటా చలికాలం చివరన వచ్చే సమస్యే కావడంతో పెద్దగా అధ్యయనాలు జరగడం లేదు. అందుకే ఇది పెద్ద సమస్యే కాదని అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. సమస్య ఎక్కువైతే న్యుమోనియాకు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఏమైనా పెరుగుతున్న కేసులతో.. కరోనా రిటర్న్స్ అనిపిస్తోంది పరిస్థితి. జలుబులు, జ్వరాలు చూసి.. కరోనాకు మించి ప్రభావం ఉంటుందా అనే భయాలు వ్యక్తం అవుతున్ాయ్. కరోనా సహ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న H3N2 ఇన్‌ఫ్లూయెంజా కేసుల ధోరణి పెరగడంపై ఆరోగ్య అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.