World Record Egg: క్రేజీ గుడ్డు.. కోడిగుడ్డుకు ఇన్‌స్టాగ్రాంలో 49 లక్షల మంది ఫాలోవర్స్‌..

ఆ గుడ్డుకు ఉన్న ఫాలోవర్స్‌ని చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వంద, వెయ్యి కాదు.. ఏకంగా 49 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు ఆ కోడుగుడ్డుకి. అంత ఫాలోయింగ్‌ ఉండటానికి ఆ గుడ్డులో ప్రత్యేక ఏదైనా ఉందా అంటే అదీ లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2023 | 04:07 PMLast Updated on: Oct 26, 2023 | 4:07 PM

Instagrams Second Most Liked Post The Egg

World Record Egg: సోషల్‌ మీడియాలో ఏది, ఎప్పుడు, ఎందుకు వైరల్‌ అవుతుందో తెలియదు. ఎవరు ఎప్పుడు స్టార్‌ అవుతారో కూడా తెలియదు. ఎంతో మందిని ఓవర్‌ నైట్‌లో స్టార్లను చేసింది సోషల్‌ మీడియా. ఎంతో మంది పరువు కూడా తీసింది. ఏదైనా ట్రెండ్‌ వచ్చింది అంటే అంతా సింపుల్‌గా ఆ ట్రెండ్‌ ఫాలో అవుతుంటారు. ఇంత కాలం ఇది కేవలం మనుషులకే పరిమితం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఓ కోడిగుడ్డు ఇన్‌స్టాగ్రాంలో సెన్సేషన్‌గా మారింది.

ఆ గుడ్డుకు ఉన్న ఫాలోవర్స్‌ని చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వంద, వెయ్యి కాదు.. ఏకంగా 49 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు ఆ కోడుగుడ్డుకి. అంత ఫాలోయింగ్‌ ఉండటానికి ఆ గుడ్డులో ప్రత్యేక ఏదైనా ఉందా అంటే అదీ లేదు. ఈ ప్రొఫైల్‌లో ఆ ఒక్క గుడ్డు ఫొటో తప్ప ఏ ఫొటో కనిపించదు. ది ఎగ్‌ గ్యాంగ్‌ అనే పేరుతో ఈ అకౌంట్‌ హ్యాండిల్‌ చేస్తున్నారు. ఈ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ ఎవరో ఒకరు ఈ ఫొటోకు లైక్‌లు కొడుతూ, కామెంట్లు పెడుతూ ఈ కోడిగుడ్డును ప్రత్యేకంగానే ఉంచుతున్నారు. కేవలం ఫాలోవర్స్‌లో మాత్రమే కాదు. లైక్స్‌లో కూడా ఈ గుడ్డు కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకే ఈ కోడిగుడ్డుకు 55 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. 2018లో ఓ సీరియల్‌ యాక్టర్‌ తన కూతురు ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తే 18 లక్షల లైక్స్‌ వచ్చాయి.

ఆ రికార్డ్‌ను కూడా ఈ కోడిగుడ్డు బీట్‌ చేసింది. 2022లో ఫిపా మ్యాచ్‌ గెలిచిన తరువాత మెస్సీ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. అప్పట్లో మెస్సీ ఫొటోల తరువాత ఎక్కువ లైక్స్‌ వచ్చిన ఫొటోగా ఈ కోడిగుడ్డు ఫొటో నిలిచింది. అసలు ఈ గుడ్డు ప్రత్యేకత ఏంటో.. ఎందుకు లైక్స్‌ కొడుతున్నారో వాళ్లకే తెలియాలి అంటున్నారు ఈ న్యూస్‌ విన్న పబ్లిక్‌.