Insurence: లవ్ బ్రేకప్ అయితే ఇన్సూరెన్స్..ఇలాంటి స్కీమ్ ఉందని మీకు తెలుసా ?
కెచప్ కలిపినంత ఈజీగా లవ్ బ్రేకప్స్ అయిపోతున్నాయ్ ఈ మధ్య ! ప్రేమికులు విడిపోవడానికి ఒకప్పుడు రకరకాల కారణాలు ఉండేవి.. ఇప్పుడు మాత్రం బ్రేకప్‌కు ప్రేమికులే కారణం అవుతున్నారు. 100లో 98 ప్రేమలు బ్రేకప్ దారిలోనే నడుస్తున్నాయ్. బ్రేకప్ అయింది కదా అని మందుబాటిల్, కుక్కపిల్ల పక్కనపెట్టుకొని దేవదాస్ లెవల్‌లో బాధపడిపోతుంటారు చాలామంది ! అలా బాధపడేవాళ్లకు ఇప్పుడు గుడ్‌న్యూస్.
బ్రేకప్‌కు ఇన్సూరెన్స్ వచ్చింది. లవ్ పోతే.. డబ్బులు వచ్చి పడతాయ్ అకౌంట్‌లో ! నమ్మాలని అనిపించకపోయినా.. నమ్మి తీరాల్సిన నిజం ఇదే ! ఇప్పటివరకు లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించే విని ఉంటారు. ఐతే లవ్‌లో బ్రేకప్ అయితే ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ అనే పథకం ఉంది.
ప్రేమికులు విడిపోయిన తర్వాత డబ్బుపరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ సంస్థలు ఇలాంటి పథకాలను అందిస్తున్నాయ్. అందిస్తున్నాయి. వాటిల్లో ఈ హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఒకటి. ఈ మధ్య ప్రతీక్ అనే ట్విటర్ యూజర్… ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియురాలితో ఒప్పందం చేసుకున్నాడు. పొరపాటున విడిపోతే.. ఎవరికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేలా హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ పేరుతో ప్రేమలో మోసపోయిన వాళ్లు డబ్బులు తీసుకోవాలనే కండిషన్ పెట్టుకున్నారు.
దీనికోసం ప్రతీక్, అతని లవర్ కలిసి ఓ బ్యాంక్‌లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రతీ నెలా అకౌంట్‌లో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశారు. ప్రియురాలు తనను మోసం చేయడంతో.. బ్రేకప్ తర్వాత ఇప్పుడు 25వేలు నగదు పొందినట్లు.. ఆ విషయాన్ని ప్రతీక్ షేర్ చేశాడు. ఇది చూసి.. ఇలాంటి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రతీక్ నువ్ గ్రేట్ బాస్.. మోసపోతానని ముందే గ్రహించి ఇన్సూరెన్స్ చేసుకున్నావ్ చూడు.. నీ ముందు చూపుకు టేక్ ఏ బౌ అంటూ.. మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.