జిబ్లీ సేఫేనా ? డార్క్ వెబ్‌లో మీ ఫొటోలు
జిబ్లీ స్టైల్ ఇమేజెస్. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ట్రెండ్ ఇది. దీన్ని పబ్లిక్ ఏ రేంజ్‌లో వాడుతున్నారు అంటే.. ఏకంగా జిబ్లీ సీఈవో మమ్మల్ని పడుకోనివ్వండ్రా బాబు కాస్త గ్యాప్ ఇవ్వండి అని పోస్ట్ పెట్టాడు.

జిబ్లీ స్టైల్ ఇమేజెస్. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ట్రెండ్ ఇది. దీన్ని పబ్లిక్ ఏ రేంజ్‌లో వాడుతున్నారు అంటే.. ఏకంగా జిబ్లీ సీఈవో మమ్మల్ని పడుకోనివ్వండ్రా బాబు కాస్త గ్యాప్ ఇవ్వండి అని పోస్ట్ పెట్టాడు. ఆ రేంజ్‌లో వాడేతస్ఉన్నారు. జిబ్లీలో ఫొటోలు ఎడిట్ చేసుకునేవాళ్లంతా.. ముఖ్యంగా అమ్మాయిలు.. ఒక్కసారి ఆలోచించండి. మీ డేటా సేఫేనా. ఓపెన్ ఏఐ యూజర్స్ దగ్గర్నించి డేటా సేకరిస్తున్నామని ఓపెన్‌గానే చెప్తోంది. ఆ డేటా సేఫ్‌గానే ఉందా.
ఒక్కోసారి ఆ డేటా చెడుకి యూజ్ అవ్వొచ్చు. డార్క్ వెబ్‌లో కనిపించొచ్చు. క్లియర్ వ్యూ అనే ఓ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి డచ్ దేశానికి చెందిన డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ వాచ్‌డాగ్ 33.7 మిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. ఎందుకో తెలుసా.. ఆ కంపెనీ తన దగ్గర ఉన్న యూజర్స్ డేటా మొత్తం అమ్మేసింది. ఔటాబాక్స్ అనే ఓ కంపెనీ నుంచి డేటా బ్రీచ్ జరిగింది. ఇందులో కొన్ని లక్షలప మంది ఫొటోలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి.
ఆఖరికి చాలా మంది వాడే యాపిల్ వాచ్ కూడా మీ హెల్త్ డేటాను సేకరిస్తోంది. ఈ డేటాతో ఏం చేసుకుంటారు అనే డౌట్ మీకు రావొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చు. ఒక ఫొటో ఉంటే చాలు దాంతో వీడియోలు తయారు చేసే రోజులు ఇవి. అలాంటి జిబ్లీలో చాలా మంది ఏకంగా పర్సనల్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నారు. వాటితో ఏమైనా చేయొచ్చు. ప్రతీ సారి తప్పు జరుగుతుంది అని నేను చెప్పను.. బట్ తప్పు జరిగే అవకాశం మాత్రం 110 పర్సెంట్ ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ఫొటోస్ అప్‌లోడ్ చేసేవాళ్లు.. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్.