WEATHER: చల్లని కబురు.. వానలపై వాతావరణశాఖ గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయ్. ఉక్కపోత అప్పుడే మొదలైంది. ఏసీలకు పని చెప్పడం స్టార్ట్ అయింది. దీంతో వర్షాల సంగతి ఏంటి.. ఈసారి కూడా ఇబ్బందులు తప్పవా అని జనాలు అనుకుంటున్న వేళ.. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
WEATHER: ఈసారి ఎండలు మండడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్‌లో రావాల్సిన సూర్యుడు.. ముందే ముచ్చటపడి ఫిబ్రవరికి వచ్చాడా అన్నట్లు ఉన్నాయ్ ఎండలు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయ్. ఉక్కపోత అప్పుడే మొదలైంది. ఏసీలకు పని చెప్పడం స్టార్ట్ అయింది. దీంతో వర్షాల సంగతి ఏంటి.. ఈసారి కూడా ఇబ్బందులు తప్పవా అని జనాలు అనుకుంటున్న వేళ.. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
Nitish Kumar: బిహార్‌లో అవిశ్వాస పరీక్ష నెగ్గిన నితీష్..
2023లో లోటు వర్షపాతం నమోదయింది. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఈసారి కూడా వానలు పడకపోతే.. అన్నదాత కష్టాలు మాములుగా ఉండవ్. ఐతే వాతావరణ శాఖ సమాచారంతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2023లో లోటు వర్షపాతాన్ని అందించిన ఎల్‌నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికల్లా కనుమరుగు అవుతాయని.. దీంతో ఈ వర్షాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయన్న ఆశలు కలుగుతున్నాయని వాతావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడంతో.. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయ్. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై దీని ప్రభావం ఉంటుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయ్.
ఐతే ఇప్పటికే ఎల్‌నినో వీక్ కావడం మొదలైందని.. ఆగస్టువాటికి లానినో పరిస్థితులు ఏర్పడే చాన్స్‌లు ఉన్నాయని.. రెండు అంతర్జాతీయ వాతావరణ ఏజెన్సీలు ప్రకటించాయ్. జూన్, ఆగస్టు మధ్యలో లానినో పరిస్థితులు మొదలవుతాయని.. దీంతో గత ఏడాదికంటే ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయని.. వాతావరణ సైంటిస్టులు చెప్తున్నారు. ఐతే వాతావరణ మోడల్స్ కచ్చితంగా ఉండకపోవడం అనే తలనొప్పి కారణంగా అలా జరగకపోయే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.