Bengaluru: ఏడాదికి 94 లక్షల ప్యాకేజీయేనా? బెంగళూరులో ఎలా బతుకుతావ్.. బ్రో !

ఓ వ్యక్తి కోరాలో విచిత్రమైన ప్రశ్న వేశాడు. దాంతో మండిపోయిన నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. బెంగళూరులో 32యేళ్ళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఏడాదికి 94 లక్షల రూపాయల జీతం చాలా తక్కువ అవుతుందా? అని కోరాలో అడిగాడు ఓ నెటిజన్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2024 | 02:04 PMLast Updated on: Feb 20, 2024 | 2:04 PM

Is Rs 94 1 Lpa Low For Living In Bengaluru Man Shares Sarcastic Reply

Bengaluru: సాఫ్ట్‌వేర్ పీపుల్‌కి టాలెంట్ ఉండాలే గానీ డబ్బులు ఎంతైనా వస్తాయని అంటుంటారు. కానీ, గత నాలుగైదుళ్ళుగా ఐటీలో జాబ్స్ రిక్రూట్‌మెంట్ తగ్గిపోయింది. కొత్త ఉద్యోగాల మాటేమోగానీ.. రోడ్డున పడేవాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఏదో ఒక సంస్థలో.. ఎంతో కొంత జీతంతో ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు కొందరైతే.. ఉన్న ఉద్యోగం పోకుండా ఉంటే చాలని మరికొందరు ఐటీ పీపుల్ అనుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, జపాన్.. ఇలా చాలా యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడటంతో ఇండియాలో ప్రతి ఒక్కరికీ జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ అయింది. ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఐటీ సెక్టార్ కొట్టుకుంటుంటే.. ఓ వ్యక్తి కోరాలో విచిత్రమైన ప్రశ్న వేశాడు.

KCR-BJP: ఒప్పుకోండి ప్లీజ్ ! కేసీఆర్‌కి జైలు తప్పదా.. ఢిల్లీలో పైరవీలు అందుకేనా..?

దాంతో మండిపోయిన నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. బెంగళూరులో 32యేళ్ళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఏడాదికి 94 లక్షల రూపాయల జీతం చాలా తక్కువ అవుతుందా? అని కోరాలో అడిగాడు ఓ నెటిజన్. అంతే నెటిజన్లకు కాలింది. అసలే జాబ్స్ లేక చస్తుంటే ఇలాంటి క్వొశ్చన్ వేస్తావా అని ఓ రేంజ్‌లో మడతపెట్టేశారు. ఒక్కో రిప్లయ్.. ఒక్కో ఆణిముత్యం అనుకోండి. ఆ ఆన్సర్లు చూసి కొశ్చన్ అడిగినోడిగికి దిమ్మతిరిగి పోయి ఉంటుంది. ఏడాదికి 94 లక్షలు అంటే.. నెలకు దాదాపు 8 లక్షలు. మంత్లీ 8 లాక్స్ శాలరీ అంటే నాట్ ఏ జోక్. అసలు బెంగళూరులో 30 నుంచి 35 యేళ్ళున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఏడాదికి 7 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మధ్యలో ప్యాకేజీ ఉంటుంది. కానీ 94 లక్షల ప్యాకేజీని కూడా లైట్ తీసుకోవడంతో నెటిజెన్లు ఓ ఆటాడేసుకున్నారు. ఏడాదికి 94 లక్షల ప్యాకేజీయా.. మరీ తక్కువ అని చెప్పను కానీ కాస్త తక్కువే. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే నువ్వు బెంగళూరులో బతికే అవకాశం ఉంటుంది బ్రో అంటూ రిప్లయ్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఓ నెటిజన్. ఆ డబ్బులతో ఏమేమి చేయకూడదో, ఏమేమి చేయాలో డిటైల్డ్‌గా, ఫన్నీగా జవాబు ఇచ్చాడు అతను. అందులో మొదటిది ఏంటంటే ఆఫీస్‌కు హెలికాఫ్టర్‌లో వెళ్లే బదులు లగ్జరీ కారు కొనుక్కో. ఒక హౌసింగ్ సొసైటీ మొత్తం కొనే బదులు ఒక అపార్ట్‌మెంట్ కొంటే సరిపోతుంది. ఇంటికి దగ్గరలో స్కూల్ కట్టుకోవడం కన్నా పిల్లలని దగ్గరలో ఉన్న స్కూలుకి పంపడం బెటర్.

BRS-BJP: రేవంత్ నెత్తిన బాంబ్.. ఆ కేసుతో రేవంత్‌కు షాక్ ! బీజేపీ, బీఆర్ఎస్ మాస్టర్ స్ట్రోక్

ఇంట్లో సరుకులు అయిపోయాయని డీమార్ట్ అవుట్‌లెట్ మొత్తం కొనేయొద్దు. నీకు అవసరమైన వస్తువులు మాత్రం కొనుక్కుంటే సరిపోతుంది. దీపావళికి డబ్బు కట్టలకు బదులు టపాసులు కాల్చు బ్రో. ఒకవేళ నీకు ఎప్పుడైనా సినిమా చూడాలనిపిస్తే దాని కోసమని ఏకంగా థియేటర్‌ని కట్టించుకోకుండా మీకు దగ్గర్లో ఉన్న ఏదో ఒక థియేటర్‌కు వెళితే సరిపోతుంది. అయినా.. ఈ జీతంతో మీరు కాస్త జాగ్రత్తగా గడపండి బ్రో అంటూ సెటైరికల్‌గా రిప్లై ఇచ్చాడు ఆ నెటిజన్. ఈ ఆన్సర్ చదివిన వాళ్ళు పడీ పడీ నవ్వుతున్నారు. దీనికి ఏకంగా 29 లక్షలకు పైగా వ్యూస్, ఐదు వేల వరకు లైకులు కూడా వచ్చాయి. సౌరబ్ బెనర్జీ అనే మరో యూజర్ కూడా ఈ ప్రశ్నకు రిప్లయ్ ఇచ్చాడు. దేవుడా.. నేనింకా షాక్‌లోనే ఉన్నా. ఇన్నేళ్ళుగా.. అంత తక్కువ జీతం ఇచ్చే కంపెనీ నుంచి బయటకు రాకుండా ఎలా బతుకుతున్నావు బ్రో. వెంటనే జాబ్‌కి రిజైన్ చేసి.. మరో కంపెనీలో 300 పర్సెంట్ హైక్ తీసుకో. నీకు ఇంకా మెరుగైన జీతం రావాలి. నీ వయసులో ఉన్న వాళ్ళంతా అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. బాబూ.. వెంటనే నీ ఉద్యోగం మానేసి.. ఏడాదికి 94 లక్షలు కాదు.. 94 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చే జాబ్ వెతుక్కో అని ఇచ్చిపడేశాడు. ఇంకొకతను ఏడాదికి 94 లక్షల రూపాయల ప్యాకేజీతో నువ్వు బెంగళూరులో గాలి కూడా పీల్చలేవు.

బెంగళూరులో మామూలుగా బతకాలన్నా ఏడాదికి 94 కోట్ల ప్యాకేజీ కావాలి బ్రో.. అందుకే నీకు 100 కోట్లపైన శాలరీ ప్యాకేజీ అయితే బెటర్.. బెంగళూరులో అండర్‌ వేర్ కొనుక్కోవాలంటేనే 50 లక్షలు ఖర్చవుతాయి. అంటే నీ జీతంతో నువ్వు ఏడాదికి రెండు మాత్రమే కొనుక్కోగలవు. మిగతా ఖర్చులన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బ్రో.. నువ్వు ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి బతకాలి. పాపం ఎలా మేనేజ్ చేస్తున్నావు బ్రో? అసలు అంత తక్కువ జీతం ఇస్తున్న కంపెనీ ఏదో చెప్పు అంటూ క్లాస్ పీకాడు మరొకతను. బెంగళూరులో 94 లక్షల ప్యాకేజీ సరిపోతుందా అని కోరాలో వచ్చిన ఈ ప్రశ్నకు ఇప్పటికే వందల్లో సమాధానాలు ఉంటే వాటిని అప్ ఓట్ చేసిన వాళ్ళయితే వేల సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రశ్న అడిగిన అతను ఫన్నీగా అడిగాడో.. సీరియస్ గా అడిగాడో తెలియదు గానీ ఆన్సర్లు మాత్రం అంతకంటే ఫన్నీగా, సెటైరిక్‌గానే వచ్చాయి. కొందరైతే ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అంటూ తిట్టిపోశారు. కానీ ఏ ఒక్కటి కూడా పాజిటివ్‌గా రాలేదు.