Uttarakhand : ఉత్తరాఖండ్ (దేవ్ భూమి) ని దహిస్తున్న కార్చిచ్చు.. దేశానికి ముప్పు తప్పదా..?

దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవుల్లో భారీగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో గత మూడు రోజులుగా అంచలంచలుగా అడువలు కాలిబూడిదయ్యిపోతున్నాయి. అటవీ జంతువులు మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దాదాపు 1100 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం కాలిబూడిదయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2024 | 01:17 PMLast Updated on: May 06, 2024 | 1:17 PM

Is The Fire Burning Uttarakhand Dev Bhoomi A Threat To The Country

ఉత్తరాఖండ్ దేవ్ భూమి.. ప్రకృతి రమణీయతకు.. హిమాలయ ఒడిలో ఉన్న అతి సుందర రాష్ట్రం ఉత్తరాఖండ్.. కింద ప్రకృతి సౌందర్యం.. పైన హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉన్న రాష్ట్రం.. మరో వైపు గంగా, మందాకిని, అనకనంద, భాగీరధి నదుల సంగమ క్షేత్రాలు.. ఛార్ దామ్ యాత్ర అయిన గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాథ్, బద్రినాథ్ వంటి.. ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు కార్చిచ్చు దహిస్తుంది.

ఇక విషయంలోకి వెళితే.. దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవుల్లో భారీగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో గత మూడు రోజులుగా అంచలంచలుగా అడువలు కాలిబూడిదయ్యిపోతున్నాయి. అటవీ జంతువులు మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దాదాపు 1100 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం కాలిబూడిదయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి.. హెలికాప్టర్ల సాయంతో నీటిని వెదజల్లి మంటలను అదుపు చేస్తున్నారు. ఈ మంటలకు గత మూడు రోజుల్లోనే నలుగురు మృతిచెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల కిందట అల్మోరా జిల్లాలో పైన్ రెసిన్ అటవీ ప్రాంతంలో మంటల్లో చిక్కుకుని పూజ అనే 28 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. గతేడాది నవంబరు 1 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 918 కార్చిచ్చు ఘటనలు చోటుచేసుకున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 1న చెలరేగిన కార్చిచ్చు కారణంగా 1,144 హెక్టార్ల విస్తీర్ణంలో అడవికి అగ్నికి ఆహుతయ్యింది.

  • భక్తులను చుట్టుముట్టిన మంటలు..

ఇది ఇలా ఉంటే కార్చిచ్చు విషయం తెలియక అల్మోరా జిల్లాలోని ప్రముఖ క్షేత్రం దునగిరి ఆలయాన్ని కొందరు భక్తులు సందర్శించారు. ఆ సమయంలో ఆ ఆలయాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఆ మంటల నుండి తప్పించుకోడానికి భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. దునగిరి పూజారులు, అటవీ శాఖ బృందం అప్రమత్తం కావడంతో భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆర్మీ వెల్లడించింది. మంటలు వేగంగా వ్యాపించటానికి బలమైన గాలుల కారణమని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. కార్చిచ్చుతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. హల్ద్వానీ రహదారిలో భారీగా కొండచరియలు విరిగి పడటంతో మంటలు ఆర్పేందుకు ఆటంకంగా మారింది.

  • కివి పండ్ల తోటలకు కార్చిచ్చు వ్యాప్తి..

రుద్రప్రయాగ్ జిల్లాలో వేగంగా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. చమోలీ జిల్లాలో కివి పండ్ల తోటలకు మంటలు వ్యాపించాయి. రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ, కర్ణ ప్రయాగ, నంద ప్రయాగ, చమోలి జిల్లాలో ప్రముఖ పున్యక్షేత్రాలు అయిన చార్ ధార్( గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాథ్, బద్రినాథ్) యాత్రికులకు ఇదే ప్రధాన జాతీయ రహదారి.. దీంతో అక్కడ కార్చిచ్చు వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర తెరుచుకోలేదు కాబట్టి ఆ రహదారిలో ప్రయాణం తక్కువ ఉండటంతో అక్కడి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

  • దేవ్ భూమికి ముప్పు తప్పదా..?

ఈ విపత్తు ఇలాగే కొనసాగితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి భారీ ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల వల్ల అధిక ఉష్ణోగ్రతతో పాటు బ్లాక్ కార్బన్ విడుదల అవుతుందన్నారు. దీనివల్ల ఎగువన ఉన్న హిమలయా పర్వతాలు వెంగంగా కరిగిపోయి ప్రమాదం లోకపోలేదని హెచ్చరించారు.
హిమాలయ పర్వతాలు కరిగిపోవడం వల్ల గంగానది.. అలకనంద.. భాగీరథి నదులు ఉప్పొంగి ప్రవహించి దిగువను ఉన్న రిషికేష్.. హరిద్వార్ ప్రాంతాలకు భారీగా ముప్పు సంభవిస్తుంది హెచ్చరించారు పర్యావరణ శాస్త్రవేత్తలు. దానికి తోడు ఈది వేశవి కాళం కావడంతో భారీ ఎండలకు మంటలు ఎగసి పడుతున్నాయి.

SSM