షష్ఠగ్రహ కూటమి అంత డేంజరా…?
సాధారణంగా గ్రహణాలు ఏర్పడే సమయంలో రకరకాల వార్తలను మనం వింటుంటాం. ఈ ఏడాది ఇప్పటికే మార్చి 14న చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడనుంది.

సాధారణంగా గ్రహణాలు ఏర్పడే సమయంలో రకరకాల వార్తలను మనం వింటుంటాం. ఈ ఏడాది ఇప్పటికే మార్చి 14న చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే అదే రోజు షష్ట గ్రహ కూటమి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే షష్ట గ్రహ కూటమి అనేది నిర్దిష్ట రాశిలో ఆరు గ్రహాలైన రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని రాహువు కలయిక ద్వారా ఏర్పడుతుంది. అయితే ఎక్కువగా షష్టగ్రహ కూటమి మీన రాశిలో ఏర్పడుతుంది.
ఈ షష్ట గ్రహ కూటమితో ఏదో విపత్తు జరుగుతుందని వాళ్లకు మంచిదని.. వీళ్లకు చెడ్డదని ఎవరికీ తోచింది వారు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఒకే కక్ష్యలోకి 6 రాశులు రాశులు రావడం అరిష్టం అని కొందరూ పేర్కొంటున్నారు. ఒకే గ్రహం పై 6 గ్రహాలు రావడం సైన్స్ అద్భుతమని దీని వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని అంటున్నారు. గ్రహాలు వ్యక్తిగత జన్మనక్షత్రాన్ని బట్టి ఆయారాశులపై ప్రభావం చూపించవచ్చని మరికొందరూ పేర్కొంటున్నారు. కొందరూ విధ్వంసం తప్పదని చెబుతున్నారు. 29 రోజు మీన రాశి వారికి మాత్రమే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఉగాది ఆరు గ్రహాల కూటమితోనే ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. షష్ట గ్రహ కూటమి వల్ల మానవులకు ఎలాంటి ప్రమాదం లేదని హేతువాదులు చెబుతున్నారు. విశ్వంలో ఇలాంటివి కామన్ గా జరిగేవి. వాటి ప్రభావం ముఖ్యంగా భూమి మీద, మనుషుల మీద ఉండదు. ఎవ్వరికీ ఎలాంటి నష్టం జరగదు అని పేర్కొంటున్నారు. షష్టగ్రహ కూటమి అంతా ట్రాష్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈనెల 29న షష్ట గ్రహ కూటమితో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరీ.