Israeli Palestinian Conflict: విస్తరిస్తున్న ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా..?

గాజాలో హమాస్‌ మిలిటెంట్లతో పోరాతుడున్న ఇజ్రాయెల్‌ సైన్యంపై ఊహించని విధంగా మరో వైపు నుంచి దాడి జరిగింది. ఆ దాడి చేసింది లెబనాన్‌, సిరియా. ఈ రెండు దేశాలు ఇప్పుడు పాలస్తీనాకు మద్దతుగా వచ్చాయి. మరోపక్క ఖతార్‌, ఇరాన్‌ లాంటి దేశాలు కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2023 | 07:26 PMLast Updated on: Oct 12, 2023 | 7:26 PM

Israeli Palestinian Conflict Will Lead To World War 3

Israeli Palestinian Conflict: ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య యుద్ధం రోజు రోజుకూ భీకరంగా మారుతోంది. హమాస్‌ దాడికి ప్రతిదాడిగా గాజాలో ఇజ్రాయెల్‌.. విధ్వంసకర రీతిలో యుద్ధం చేస్తోంది. గాజాలో హమాస్‌ మిలిటెంట్లతో పోరాతుడున్న ఇజ్రాయెల్‌ సైన్యంపై ఊహించని విధంగా మరో వైపు నుంచి దాడి జరిగింది. ఆ దాడి చేసింది లెబనాన్‌, సిరియా. ఈ రెండు దేశాలు ఇప్పుడు పాలస్తీనాకు మద్దతుగా వచ్చాయి. మరోపక్క ఖతార్‌, ఇరాన్‌ లాంటి దేశాలు కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ దేశాలు ఇజ్రాయెల్‌కు సానుకూలంగా ఉన్నాయి.

ఇవన్నీ చూస్తుంటే యుద్ధం రోజురోజుకూ విస్తరిస్తోందనే భయాలు పెరిగిపోతున్నాయి. ఇది మూడో ప్రంపంచయుద్ధానికి దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధం రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు కూడా రెండు దేశాల మధ్య మొదలైన గొడవ మెల్లిమెల్లిగా వివిధ దేశాలకు విస్తరించింది. ఆస్ట్రియా యువరాజు ఫెర్నాండెజ్‌ హత్యకు ప్రతీకారంగా సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధానికి దిగింది. మొదట యుద్ధం ఈ రెండు దేశాల మధ్యే జరిగింది. కానీ తరువాత యుద్ధం వేరే దేశాలకు విస్తరించింది. ఆస్ట్రియాకు జర్మనీ, ఇటలీ మద్దతు పలికాయి. సెర్బియాకు రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ అండగా నిలిచాయి. 1914 జూలై 28 నుంచి 1918 నవంబరు 11 వరకు ఈ యుద్ధం జరిగింది. ఆ తరువాత రష్యా, ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఆస్ట్రియా తరఫున పోరాడాయి. జర్మనీకి, ఇటలీకి వ్యతిరేకంగా ఉన్న దేశాలు సెర్బియా తరఫున పోరాడాయి. ఇక యుద్ధం విస్తరిస్తూ అది ప్రపంచ యుద్ధంగా మారింది.

ఇప్పుడు ఇజ్రాయెల్‌ విషయంలో కూడా దాదాపు ఇదే సీన్‌ కనిపిస్తోంది. రెండు దేశాలు యుద్ధం చేస్తుంటే ఆపాల్సింది పోయి లెబనాన్‌, సిరియా పాలస్తీనాకు మద్దతుగా యుద్ధానికి దిగుతున్నాయి. మరోపక్క ఖతార్‌, ఇరాన్‌ కూడా ఛాన్స్‌ దొరికితే దూకేస్తాం అన్నట్టు వెయిట్‌ చేస్తున్నాయి. ఈ సీన్‌ చూసి ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న దేశాలు కూడా యుద్ధం మొదలు పెడితే ఇది మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. ఇప్పటికే కరోనా వల్ల ప్రపంచానికి చాలా డ్యామేజ్‌ జరిగింది. దానికితోడు రష్యా, యుక్రెయిన్‌ వార్‌తో ఆర్థిక వ్యవస్థ చాలా వరకూ దెబ్బతింది. ఇలాంటి టైంలో ఈ రెండు దేశాలు యుద్ధం చేయడం ప్రంపచ ఆర్థిక వ్యవస్థకు అంత మంచింది కాదు. వాటికి మద్దతుగా మరిన్ని దేశాలు యుద్ధం చేస్తే దాన్ని మించిన ప్రమాదం మరోటి ఉండదు.